బెంగళూరు వర్షాలు : ఇప్పటికే దారుణంగా పరిస్థితి! ఐఎండీ నుంచి మరో బ్యాడ్​ న్యూస్​..-bengaluru rains latest waterlogged roads flooded metro station and peoples fury ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బెంగళూరు వర్షాలు : ఇప్పటికే దారుణంగా పరిస్థితి! ఐఎండీ నుంచి మరో బ్యాడ్​ న్యూస్​..

బెంగళూరు వర్షాలు : ఇప్పటికే దారుణంగా పరిస్థితి! ఐఎండీ నుంచి మరో బ్యాడ్​ న్యూస్​..

Published May 20, 2025 01:02 PM IST Sharath Chitturi
Published May 20, 2025 01:02 PM IST

భారీ వర్షాలకు బెంగళూరు మహా నగరం కుదేలైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మే 20న కూడా భారీ వర్షాలు పడతాయని కర్ణాటకకు ఐఎండీ రెడ్​ అలర్ట్​ ఇచ్చింది. ఇక నగరంలో అద్వాన పరిస్థితులపై ప్రజలు సోషల్​ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులో గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రెడ్​ అలర్ట్​ ఇచ్చింది వాతావరణ శాఖ. వర్షాలకు రోడ్లే కాదు మెట్రో స్టేషన్లు, ఐటీ హబ్​లోని ప్రాంగణాలు, స్టేడియం వంటివి నీటమునిగాయి. ప్రజలు వ్యవస్థపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు పర్ఫెక్ట్​ నగరం అని జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఒక్క వర్షంతో చెక్​ పడిందని అంటున్నారు.

(1 / 5)

భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాల్లో అధికారులు ఇలా సహాయక చర్యలు చేపట్టారు.

(2 / 5)

బెంగళూరులోని ఓ ప్రాంతంలో సోమవారం తీసిన ఏరియల్​ ఫొటో ఇది. బెంగళూరు వీధులు వెన్నిస్​ని తలపిస్తున్నాయని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.

(3 / 5)

(AFP)

బెంగళూరులు విల్సన్​ గార్డెన్​లోని ఓ భవనంలోకి నీరు ఇలా చేరింది. వాహనాలు నిటమునిగాయి. పరిస్థితి చక్కబడిన తర్వాత నష్టం గురించి లెక్కలేసుకోవాలని స్థానికులు అంటున్నారు.

(4 / 5)

(PTI)

బెంగళూరులోని ఓ దుకాణంలోకి చేరుకున్న వర్షపు నీరు. చాలా చోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలు వ్యవస్థపై అసంతృప్తిగా ఉన్నారు. “నేను పన్నులు చెల్లిస్తున్నాను. నాకు ఫ్రీబీస్​ (ఉచిత పథకాలు) కూడా రావు. నాకు అక్కర్లేదు కూడా! బదులుగా నేను కోరుకునేది ఒక్కటే! వర్షాకాలం రాకముందే కుదేలవ్వని నగరం నాకు కావాలి,” అని ఓ వ్యక్తి సోషల్​ మీడియాలో తన ఆవేదనను బయటపెట్టాడు.

(5 / 5)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు