బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ మెయిల్!-bengaluru airport receives hoax bomb threat message about explosives in toilet prompts emergency security checks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ మెయిల్!

బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ మెయిల్!

Published Jun 19, 2025 04:03 PM IST Anand Sai
Published Jun 19, 2025 04:03 PM IST

బెంగళూరు విమానాశ్రయంలో రెండు బాంబులు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. ఓ ఉగ్రవాది పేరిట ఒకటి ప్లాన్ ఏ కింద, మరొకటి ప్లాన్ బీ కింద అని పేర్కొన్నారు.

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలో రెండు బాంబులు పెట్టినట్లు ఉగ్రవాది పేరిట పంపిన ఈ మెయిల్ లో పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. ఒక బాంబును ప్లాన్ ఏ కింద, మరొకటి ప్లాన్ బీ కింద ఉంచుతారు.

(1 / 4)

బెంగళూరు విమానాశ్రయంలోని మరుగుదొడ్డి పైప్ లైన్ లో పేలుడు పదార్థాన్ని ఉంచినట్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. బెదిరింపు లేఖ అందుకున్న భద్రతా సంస్థలు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టాయి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని నిర్ధారించారు. బెదిరింపు ఫేక్ అని ప్రకటించారు.

(2 / 4)

ఈ మెయిల్ పై కేసు నమోదు చేసి, మెసేజ్ ఎక్కడ నుంచి వచ్చిందో కనుగొనేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వారం ప్రారంభంలో అనేక హై ప్రొఫైల్ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత బెదిరింపు మెయిల్స్ ఫేక్ అని తేలింది. గతంలో భారత్ నుంచి వెళ్లే పలు అంతర్జాతీయ విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.

(3 / 4)

2022 నుంచి 2024 వరకు కర్ణాటకలో 169 నకిలీ బాంబు బెదిరింపుల కేసులు నమోదయ్యాయి. వీటిలో 133 బెంగళూరులోనే ఉన్నాయి. బుధవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాశ్రయ అధికారులు బాంబ్ స్క్వాడ్ లను మోహరించి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

(4 / 4)

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు