తెలుగు న్యూస్ / ఫోటో /
Spices For Heart Health: మసాలా ప్రియులారా..! మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడే మసాలా దినుసులు ఏవో మీకు తెలుసా?
Spices For Heart Health: ఇండియన్ కిచెన్లో మసాలా దినుసులకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇవి ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడాతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే మసాలా దినుసులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
(1 / 7)
మసాలా దినుసులలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి, ఇవి వివిధ ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడానికి సహాయపడతాయి. తన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, పోషకాహార నిపుణురాలు లవ్నీత్ బాత్రా ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయపడే మసాలా దినుసుల గురించి మాట్లాడారు. (Freepik)
(2 / 7)
నల్ల మిరియాలు: నల్లమిరియాలు రక్త ప్రసరణను మెరుగుపరచి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.పిపెరిన్ రక్త నాళాలలో రక్త ప్రసరణను మెరుగుపరచి గుండెకు మరింత పోషకాలను అందిస్తుంది. ఇది గుండెపోటు ప్రమదాన్ని తగ్గించి పనితీరు పునరుద్ధరణకు సహాయపడుతుంది. (Pixabay)
(3 / 7)
దాల్చినచెక్క: దాల్చినచెక్, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే అద్భుతమైన సహజమైన పదార్థం. ఇందులోని కుర్క్యూమిన్చ యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు గుండెకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి.దాల్చినచెక్క అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండెకు హానికరం కాకుండా చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరచి గుండెకు కావలసిన పోషకాలను అందిస్తుంది.(Pinterest)
(4 / 7)
ధనియాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చక్కగా సహాయపడతాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగేరక్తప్రసరణను మెరుగుపరచడంలో, శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది, దీంతో గుండెకు కావలసిన పోషకాలు అంది పనితీరు మెరుగుపడుతుంది.
(5 / 7)
పసుపు: ఇందులోని కర్క్యూమిన్ అనే కీలకమైన కాంపౌండ్ గుండె ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. రక్త నాళాల పొర అయిన ఎండోథెలియం పనితీరును మెరుగుపరుస్తుంది. కర్కుమిన్ మంట, ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, కొలెస్ట్రాల్ నియంత్రణ లక్షణాలలు గుండె బ్లాక్ లను తగ్గించి రక్తనాళాలను స్వచ్ఛంగా ఉంచుతుంది. ఇందులోని ఆక్సిడేటివ్ స్ట్రెస్, రెయాక్టివ్ ఆక్సిజన్ స్పెషీస్‌ను తగ్గిస్తుంది.(Unsplash)
(6 / 7)
వెల్లుల్లి: వెల్లుల్లిలోని క్రియాశీల సమ్మేళనం అల్లిసిన్ లిపిడ్ సంశ్లేషణలో పాల్గొనే ఎంజైమ్లను నిరోధిస్తుంది. ప్లేట్లెట్ సమీకరణను తగ్గిస్తుంది. ఇది బ్లడ్ ప్రెషర్‌ను తగ్గించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాలిన్స్ (Allicin) అనే క్రియాశీలక పదార్థం గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
(7 / 7)
అల్లం: అల్లం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, రక్తప్రసరణను మెరుగుపరచడంలో చక్కటి పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో, గుండెకు పోషకాలను అందించడంలోనూ అల్లం ముందు ఉంటుంది. దీన్ని మీ హెర్బల్ టీలో గ్రైండ్ చేసి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవచ్చు. ఎండిన అల్లం పొడిని ఉదయాన్నే తేనెతో కలిపి లేదా నీటిలో మరిగించి రోజంతా సేవించవచ్చు.(Pixabay)
ఇతర గ్యాలరీలు