(1 / 7)
రామాయణంలోని బాలకాండలో పేర్కొన్న శ్లోకం "కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలం కర్తవ్యం దైవ మాహ్నికమ్". నిద్రపోతున్న రామ లక్ష్మణులను మేల్కొలిపేందుకు గురువైన విశ్వామిత్రుడు పఠిస్తాడు. మరి, ఆ శ్లోకం విని మనం నిద్రలేవడం వల్ల కలిగే ఫలితాలేంటి? తెలుసుకోవాలనుందా!
(Pixabay)(2 / 7)
ఆధ్యాత్మిక పురోగతి - ఈ శ్లోకం రాముడిని ప్రార్థించేదిగా ఉండి, నిత్యజీవితంలో ధర్మాన్ని పాటించే దిశగా మనల్ని ప్రేరేపిస్తుంది. రాముని స్మరించుకుంటూ లేవడం వలన నైతిక విలువలను పాటిస్తూ, అన్యాయాన్ని నివారించేలా వ్యవహరిస్తాం.
(Pixabay)(3 / 7)
శాంతియుత జీవితం - ఈ శ్లోకం పఠనము శాంతిని ప్రేరేపిస్తుంది. ఉదయం సమయములో ఈ శ్లోకం వింటూ మేల్కొనడం వల్ల మనస్సు శాంతియుతంగా ఉంటుంది. ఆందోళనల నుంచి మనసుకు విముక్తి కలుగుతుంది. రోజును ఆత్మ విశ్వాసంతో ప్రారంభించవచ్చు.
(Pixabay)(4 / 7)
ధైర్యం, శక్తి - శ్లోకంలో "రామ" అని ఉండడం వలన, ఈ శ్లోకం వింటూ మేల్కోవడం మనలో ధైర్యం, ఉత్సాహం నింపుతుంది.
(Pixabay)(5 / 7)
మానసిక ఉల్లాసం - ఉదయాన్నే ఈ శ్లోకం వింటూ మేల్కొనడం వలన మన శరీరం, మనస్సు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటాయి.
(Pixabay)(6 / 7)
ఆరోగ్య ప్రయోజనాలు - ఈ శ్లోకం వింటూ మేల్కొనడం వల్ల రోజంతా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఆత్మ విశ్వాసం, శాంతి కలిగి మానసికంగా మంచి ఆరోగ్యంగా ఉంటారు.
(Pixabay)(7 / 7)
సాధనాత్మక జ్ఞానం - ఉదయ సమయంలో శ్లోకాన్ని వింటూ ఉంటే మనస్సు హుషారుగా ఉంటుంది. ఇది మన జ్ఞానాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
(Pixabay)ఇతర గ్యాలరీలు