TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కీలక అప్డేట్ - ఫైనల్ లిస్ట్ విడుదలకు మార్చి 31 డెడ్ లైన్..!-beneficiaries of indiramma housing scheme will be identified by march 31 in telangana latest updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కీలక అప్డేట్ - ఫైనల్ లిస్ట్ విడుదలకు మార్చి 31 డెడ్ లైన్..!

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కీలక అప్డేట్ - ఫైనల్ లిస్ట్ విడుదలకు మార్చి 31 డెడ్ లైన్..!

Jan 27, 2025, 06:01 AM IST Maheshwaram Mahendra Chary
Jan 27, 2025, 06:01 AM , IST

  • Telangana Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. జనవరి 26వ తేదీన లాంఛనంగా స్కీమ్ ప్రారంభించగా… పూర్తిస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ మార్చి 31వ తేదీలోపు పూర్తి కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. 

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కంది. జనవరి 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాల్లోని ఒక గ్రామంలో లబ్ధిదారులను గుర్తించారు. ఈ మేరకు కొందరికి ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు. 

(1 / 9)

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కంది. జనవరి 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాల్లోని ఒక గ్రామంలో లబ్ధిదారులను గుర్తించారు. ఈ మేరకు కొందరికి ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు. 

లాంఛనంగా స్కీమ్ ప్రారంభమైనప్పటికీ… రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులను ఎప్పటిలోపు గుర్తిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. చాలా మంది ఆశావాహులు నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు.

(2 / 9)

ఆదివారం(జనవరి 26) నారాయణపేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ స్కీమ్ కు ఎంపికైన లబ్దిదారులకు పత్రాలను అందించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. 

(3 / 9)

🔸ఆదివారం(జనవరి 26) నారాయణపేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ స్కీమ్ కు ఎంపికైన లబ్దిదారులకు పత్రాలను అందించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. 

మార్చి 31 లోపు తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్ లో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులను గుర్తిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఇందుకు ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని వివరించారు. 

(4 / 9)

🔸మార్చి 31 లోపు తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్ లో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులను గుర్తిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఇందుకు ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని వివరించారు. 

ప్రస్తుతం విడుదలైన అర్హత జాబితాలోని పేర్లతో పాటు కొత్త దరఖాస్తులను కూడా పరిశీలించనుంది. అర్హత గల వారి వివరాలను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలించనున్నారు. ఇందిరమ్మ కమిటీల సాయంతో లబ్ధిదారులను గుర్తించనున్నారు. 

(5 / 9)

ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31వ తేదీలోపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ దిశగా అధికార యంత్రాగం కూడా కసరత్తు చేస్తోంది. 

(6 / 9)

ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31వ తేదీలోపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ దిశగా అధికార యంత్రాగం కూడా కసరత్తు చేస్తోంది. 

మరోవైపు స్కీమ్ అమలు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.  అనర్హులకు స్కీమ్ అందితే తగిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది. 

(7 / 9)

ఈ మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.  ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేయనున్నారు. 

(8 / 9)

ఈ మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.  ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేయనున్నారు. 

తుది జాబితాలకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆమోదం కూడా తప్పనిసరి. ఆ తర్వాతే కలెక్టర్ పరిశీలించి… ఫైనల్ లిస్టును ఖరారు చేస్తారు. వారికి మాత్రమే ప్రోసిడింగ్స్ కాపీలను అందజేస్తారు. వారి బ్యాంక్ ఖాతాలను స్వీకరించి… ధపాలవారీగా నిధులను జమ చేస్తారు. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు