
(1 / 8)
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి.

(2 / 8)
రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టారు.

(3 / 8)
ఈ స్కీమ్ లో భాగంగా హైదరాబాద్ లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా రైల్వేశాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇప్పటికే పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులు ప్రగతికి సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొన్ని వివరాలతో పాటు ఫొటోలను షేర్ చేశారు.

(4 / 8)
బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.26.55 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం 72 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ప్రవేశమార్గం ర్యాంప్ తో పాటు పుట్ ఓవర్ బ్రిడ్జి, లిప్ట్, ఎస్కులేటర్ వంటి పనులు పూర్తయ్యాయి.

(5 / 8)
స్టేషన్ బిల్డింగ్ ఫినిషింగ్ పనులు, రోడ్డు అభివృద్ధి పనులు, అప్రోచ్ రోడ్లతో పాటు మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఇవి కూడా త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది,

(6 / 8)
ప్రయాణికుల కోసం స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు.
రైల్వే ప్లాట్‌ఫామ్ మొత్తానికి షెడ్డు నిర్మాణం చేశారు. స్టేషన్ బయట నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిర్దేశాలకు అనుగుణంగా మురుగునీటి శుద్ధికి ప్లాంటు ఏర్పాట్లు చేస్తున్నారు.

(7 / 8)
12 మీటర్ల వెడల్పు ర్యాంపుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 2 లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాట్లు చేశారు.

(8 / 8)
మిగిలిన పనులు కూడా త్వరిగతగతిన పూర్తి చేసే విధంగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం పాత రైల్వే స్టేషన్లను ఆధునీక హంగులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరో కీలకమైన కాజీపేట్ రైల్వే జంక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి.
ఇతర గ్యాలరీలు