Bedtime Habits: బరువు తగ్గాలకుంటున్నారా..? పడుకునే ముందు ఈ అలవాట్లు చేసుకోండి!
- Bedtime Habits: ఎక్సర్‌సైజ్‌లు, డైటింగ్‌లు పాటిస్తూ మాత్రమే కాదు. నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. కాకపోతే నిద్రపోవడానికి ముందు కొన్ని పనులు మాత్రం చేస్తే చాలు.
- Bedtime Habits: ఎక్సర్‌సైజ్‌లు, డైటింగ్‌లు పాటిస్తూ మాత్రమే కాదు. నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. కాకపోతే నిద్రపోవడానికి ముందు కొన్ని పనులు మాత్రం చేస్తే చాలు.
(1 / 7)
పడుకునే ముందు ఈ అలవాట్లను పాటిస్తే, నిద్రపోతున్న సమయంలోనూ మీ కేలరీలు ఖర్చు అయిపోతాయి. ఎక్సర్‌సైజ్ చేయడం చాలా మంచి విషయమే. కానీ, సాయంత్రం సమయంలో చేయడం గొప్ప విషయం. మిమ్మల్ని రిలాక్స్ చేయడంతో పాటు ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది.
(Pexel)(2 / 7)
రాత్రి సమయంలో అన్నం తిన్న తర్వాత కొద్ది దూరం నడవడం వల్ల అరుగుదల ప్రక్రియ వేగవంతమై పొట్ట ఉబ్బరం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో అదనపు కేలరీలు కూడా ఖర్చవుతాయి.
(Pexel)(3 / 7)
బరువు తగ్గడంలో కంటి నిండా నిద్ర చాలా కీలకం. సరిపడ నిద్ర ఉంటేనే హార్మోన్లు బ్యాలెన్స్ గా ఉండి, అదనపు కొవ్వు చేరకుండా ఉంటుంది.
(Pexel)(4 / 7)
పడుకోవడానికి కాసేపటి ముందే ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ చూడటం ఆపేయండి. వీటి నుంచి వెలువడే బ్లూ లైట్ మీ నిద్రను డిస్టర్బ్ చేయవచ్చు. ఇది బరువు తగ్గే ప్రక్రియను మందగించేలా చేయవచ్చు.
(Pexel)(5 / 7)
ధ్యానం చేయడం వల్ల ఆవేశపడి తినకుండా ఉంటారు. ఇది ప్రశాంతమైన నిద్ర కలుగజేయడమే కాకుండా, బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది..
(Pexel)(6 / 7)
నిద్రపోవడానికి రెండు - మూడు గంటల ముందే డిన్నర్ తినేయండి. ఆలస్యంగా తినడం వల్ల మీ నిద్ర పాడవడంతో పాటు మీరు నిద్రపోతున్న సమయంలో కేలరీలు ఖర్చు కావడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది.
(Pexel)ఇతర గ్యాలరీలు