Beauty Tips : వానాకాలంలో మెుటిమలకు ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి
Monsoon Skin Care Tips : వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు మొటిమల సమస్యలు కూడా సర్వసాధారణం. వర్షాకాలంలో చర్మ సంరక్షణ మొటిమల సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకుని వాడండి. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
(1 / 6)
వర్షాకాలంలో కూడా చెమటలు పట్టడం వల్ల చర్మం జిగటగా ఉంటుంది. చెమట శరీరంలోకి చాలా బ్యాక్టీరియాను తీసుకువస్తుంది. ముఖంపై మొటిమలు, దురదలు సర్వసాధారణం. ఇలా వర్షాకాలంలో వచ్చే మొటిమలకు ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది.
(2 / 6)
జాజికాయను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. మొటిమలకు ఇది మంచి ఔషధం. జాజికాయ పేస్ట్ తయారు చేసుకోవాలంటే అందులో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి రాయి మీద రుద్దాలి. ఆ తర్వాత పేస్ట్ లా వస్తుంది. మొటిమల మీద అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి.
(3 / 6)
నల్ల మిరియాలు పేస్ట్ లా చేసి మొటిమల మీద మాత్రమే అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు సులభంగా తొలగిపోతాయి. అయితే దీన్ని మొత్తం ముఖం మీద వాడకూడదని గుర్తుంచుకోండి. లేదంటే చికాకు కలిగిస్తుంది.
(4 / 6)
నల్ల మిరియాల పొడిని పచ్చి పాలతో మిక్స్ చేసి, బ్లాక్ పెప్పర్ పేస్ట్ లా చేసి మొటిమల మీద అప్లై చేయాలి.
ఇతర గ్యాలరీలు