
(1 / 5)
మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్ర పోషించిన పొన్మన్ మూవీ మంచి హిట్ అయింది. ఈ చిత్రంలో సాజిన్ గోపు, లిజోమోల్ జోస్ కూడా లీడ్ రోల్స్ చేశారు. ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.

(2 / 5)
పొన్మన్ మూవీ ఈ శుక్రవారం (మార్చి 14) జియోహాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన ఆరు వారాలకు ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

(3 / 5)
మార్చి 14న పొన్మన్ చిత్రం జియో హాట్‍స్టార్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో మలయాళంలో ఒక్కటే విడుదలైన ఈ మూవీ ఓటీటీలో ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.

(4 / 5)
పొన్మన్ చిత్రానికి జోతిష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇచ్చిన బంగారు ఆభరాణాలను రికవరీ చేసుకునేందుకు ఓ సేల్స్ ఏజెంట్ చేసే ప్రయత్నం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో సామాజిక అంశాలు కూడా ఉంటాయి. కామెడీ కూడా ఆకట్టుకుంటుంది.

(5 / 5)
పొన్మన్ చిత్రం రూ.3కోట్ల బడ్జెట్‍తో రూపొందగా.. సుమారు రూ.10కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని సూపర్ హిట్ అయింది. అజిత్ వినాయక ఫిల్మ్ పతాకంపై వినాయక అజిత్ ప్రొడ్యూజ్ చేసిన ఈ చిత్రానికి.. జస్టిన్ వర్గీస్ సంగీతం అందించారు.
ఇతర గ్యాలరీలు