In Pics : మీ తరపున నేనే దీక్షలో కూర్చుంటా.. బండి సంజయ్-bandi sanjay praja sangrama yatra in nacharam
Telugu News  /  Photo Gallery  /  Bandi Sanjay Praja Sangrama Yatra In Nacharam

In Pics : మీ తరపున నేనే దీక్షలో కూర్చుంటా.. బండి సంజయ్

20 September 2022, 22:34 IST HT Telugu Desk
20 September 2022, 22:34 , IST

  • BJP Praja Sangrama Yatra : బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. నాలుగో విడత యాత్రలో భాగంగా నాచారం చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు తమ సమస్యలను బండి సంజయ్ దృష్టి తీసుకెళ్లారు.

నాచారం క్రాస్ రోడ్స్ వద్ద గజమాలతో బండి సంజయ్ కి స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ వద్దకు వచ్చి, తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను సమర్పించారు.

(1 / 5)

భోజన విరామం అనంతరం నాచారం నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర యాత్ర ప్రారంభమైంది. వేలాదిగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. 8వ రోజుకు బండి సంజయ్ పాదయాత్ర చేరింది.

(2 / 5)

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా... ఇప్పటివరకు 2 వేల పైచిలుకు వినతి పత్రాలను అందుకున్నారు బండి సంజయ్. నాచారం ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో వక్ఫ బోర్డు భూముల బాధిత కుటుంబాలు బండి సంజయ్ ని కలిశారు.

(3 / 5)

నిషేధిత జాబితాలో స్థలం ఉందని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నేనున్నా... మీ తరపున నేనే దీక్షలో కూర్చుంటానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. న్యాయ పోరాటం చేస్తాం ప్రజా క్షేత్రంలో తెగించి కొట్లాడతామని చెప్పారు. వక్ఫ్ బోర్డు పేరుతో 7 వేల కుటుంబాలను హింసిస్తారా? అని ప్రశ్నించారు.

(4 / 5)

బోడుప్పల్ బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతమైతుంటే ఎందుకు పట్టించుకోవు? అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు అని వ్యాఖ్యానించారు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు