(1 / 5)
ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలన్నారు బండి సంజయ్.. కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండి అంటూ కామెంట్స్ చేశారు.
(2 / 5)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఓవైపు కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూనే… సొంత పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.
(3 / 5)
కనీసం కిషన్ రెడ్డి మీద అయినా ఢిల్లీకి పోయి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం మానేయాలన్నారు బండి సంజయ్. కార్యకర్తల నమ్మకాన్ని దెబ్బతీయవద్దని కోరారు.
(4 / 5)
పార్టీ సిద్ధాంతాల కోసం పని చేసే నాయకుడు కిషన్ రెడ్డి అని బండి సంజయ్ ప్రశంసించారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలందరం కలిసి పని చేస్తామన్నారు.
(5 / 5)
బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడిపోతున్నారని బండి సంజయ్ అన్నారు. అందుకే ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
ఇతర గ్యాలరీలు