Wamiqa Gabbi: పదేళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ.. ప్లాప్ హీరోయిన్ చేతిలో 6 సినిమాలు.. అదృష్టమంటే వామికాదే బేబీ జాన్!
- Wamiqa Gabbi Re Entry In Tollywood After 10 Years: హీరోయిన్స్‌కు ప్లాప్‌లు, సక్సెస్‌లు సర్వసాధారణం. అయితే, సినిమాలు హిట్ అయితే విపరీతమైన ఆఫర్స్ వస్తుంటాయి. కానీ, ఈ హీరోయిన్‌కు మాత్రం ప్లాప్ తర్వాత ఏకంగా చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అలాగే, పదేళ్ల తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.

(1 / 7)
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ జబ్ వి మెట్ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ వామికా గబ్బి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా మారిపోయింది.
(2 / 7)
2015లో వచ్చిన సుధీర్ బాబు భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వామికా గబ్బి. అయితే, ఆ సినిమాతో తెలుగులో అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది.
(3 / 7)
భలే మంచి రోజు సినిమా తర్వాత చార్లీ చోప్రా అండ్ ది మిస్టరీ ఆఫ్ సొలాంగ్ వాలీ, గోధా, 83, కుఫియా, మోడ్రన్ లవ్ చెన్నై, జుబిలీ వంటి ఓటీటీ సినిమాలతోను పలు భాషల్లో అట్రాక్ట్ చేసింది వామికా గబ్బి. రీసెంట్‌గా హిందీలో బేబీ జాన్ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది.
(4 / 7)
కీర్తి సురేష్, వరుణ్ ధావన్ జోడీగా నటించిన బేబీ జాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ అయిన వామికాకు వచ్చే సినిమాల ఆఫర్స్ ఏమాత్రం తగ్గలేదు.
(5 / 7)
వామికా గబ్బి ప్రస్తుతం ఆరు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. అందులో అడవి శేష్ గూఢచారి 2 ఒకటి. ఈ సినిమాతో దాదాపుగా పదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది వామికా గబ్బి.
(6 / 7)
గూఢచారి 2తోపాటు కిక్లీ అనే పంజాబీ మూవీ, జీని, ఇరవాకలం అనే తమిళ చిత్రాలు, బాలీవుడ్ ప్రాజెక్ట్ దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్, మలయాళ సినిమా టికీ టాకాలో నటిస్తోంది వామికా గబ్బి.
ఇతర గ్యాలరీలు