Babar Azam: బాబర్.. విరాట్ కోహ్లిని చూసి నేర్చుకో.. ఫామ్‌లోకి రావడానికి ఆ పని చెయ్: పాక్ మాజీ సలహా
- Babar Azam: బాబర్.. విరాట్ కోహ్లిని చూసి నేర్చుకో అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనస్ ఖాన్. తిరిగి ఫామ్ లోకి రావాలంటే ఏం చేయాలో అతడు చెప్పాడు.
- Babar Azam: బాబర్.. విరాట్ కోహ్లిని చూసి నేర్చుకో అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనస్ ఖాన్. తిరిగి ఫామ్ లోకి రావాలంటే ఏం చేయాలో అతడు చెప్పాడు.
(1 / 8)
Babar Azam: పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్ బాబర్ అజామ్ ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత క్లిష్టమైన రోజులను ఎదుర్కొంటున్నాడు.కెప్టెన్ గానే కాకుండా బ్యాట్స్ మన్ గా కూడా వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు.(AFP)
(2 / 8)
ఈ మధ్యే బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో బాబర్ 4 ఇన్నింగ్స్ ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. బంగ్లాదేశ్ తో సిరీస్ ను కూడా 0-2తో పాక్ కోల్పోవడంతో ఆ టీమ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.(AP)
(3 / 8)
ఈ అవమానకరమైన ఓటమి తర్వాత బాబర్ ఆజంపై విమర్శలు వెల్లువెత్తాయి.పేలవమైన ఫామ్ జట్టును ఓటమి వైపు నడిపిస్తోంది. అతని స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.(AP)
(4 / 8)
2009 టీ20 వరల్డ్ కప్ ను పాకిస్థాన్ కు అందించిన మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ కూడా బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని, అది అతను తిరిగి ఫామ్ లోకి రావడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.
(5 / 8)
2019లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత అతనికి కెప్టెన్సీ లభించింది.ఇప్పుడు అతను తన ఆటపై దృష్టి పెట్టాలి. కాబట్టి, అతను ఫామ్ ను తిరిగి పొందడానికి కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవాలి అని అతడు అన్నాడు.
(6 / 8)
కెప్టెన్సీ నుంచి తప్పుకుని బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలని బాబర్ కు నా సలహా. విరాట్ కోహ్లీ నుంచి బాబర్ ఆజమ్ గుణపాఠం నేర్చుకోవాలి. అతనిలాగే కెప్టెన్సీ నుంచి తప్పుకొని తిరిగి ఫామ్ లోకి రావాలి
(7 / 8)
కెప్టెన్సీ అనేది చాలా చిన్న విషయం.. ఆటగాళ్లకు ప్రదర్శన ముఖ్యం. కోహ్లీని చూడండి.. కెప్టెన్సీ నుంచి తనంతట తానుగా వైదొలిగాడు.. ఆ తర్వాత అతను ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతున్నాడు.. ఏ ఆటగాడైనా దేశం కోసం ఆడటానికి ప్రాధాన్యమివ్వాలి.. అప్పుడు వ్యక్తిగత రికార్డులు వస్తాయి అని యూనిస్ అన్నాడు.
ఇతర గ్యాలరీలు