(1 / 5)
Babar Azam: టీ20ల్లో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ నిలిచాడు.
(2 / 5)
Babar Azam: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో అతను ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు బాబర్ ఆజం.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేశాడు. బాబర్ ఇప్పటి వరకూ టీ20ల్లో 4192 రన్స్ చేశాడు.
(3 / 5)
Babar Azam: ఈ క్రమంలో 4188 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టాడు. రోహిత్ శర్మ 4231 పరుగులతో టాప్ లో ఉన్నాడు. అయితే అతని రికార్డుకు కూడా బాబర్ కేవలం 39 పరుగుల దూరంలో నిలిచాడు. ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ కావడంతో బాబర్ టాప్ స్కోరర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
(4 / 5)
Babar Azam: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో బాబర్ ఆజం 28 బంతుల్లో 41 పరుగులు చేశాడు.
(5 / 5)
Babar Azam: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ జాబితా ఇలా ఉంది. 4231 పరుగులు - రోహిత్ శర్మ (159 మ్యాచ్ లు), 4192 పరుగులు - బాబర్ ఆజమ్ (126 మ్యాచ్ లు), 4188 పరుగులు - విరాట్ కోహ్లీ (125 మ్యాచ్ లు), 3655 పరుగులు - పాల్ స్టిర్లింగ్ (147 మ్యాచ్ లు), 3531 పరుగులు - మార్టిన్ గప్తిల్ (122 మ్యాచ్ లు)
ఇతర గ్యాలరీలు