(1 / 6)
ప్రస్తుతం దేశంలో ఒకదాని తర్వాత మరో యాక్సిడెంట్స్ జరగడంతో బ్యాడ్ న్యూస్‌లు వింటున్నాం. ఎయిర్ ఇండియా విమానం కూలిపోగా పుణెలో వంతెన కూలిన ఘటనలో పలువురు మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో 2025లో ఇంకా ఏం జరగనుందో బాబా వంగా జ్యోస్యం చెప్పారు. ప్రపంచంలో ఎక్కువ భాగం ప్రజలు బల్గేరియన్‌కు చెందిన అంధ మహిళ బాబా వంగా జ్యోతిష్యాన్ని నమ్ముతారు.
(2 / 6)
అహ్మదాబాద్‌లో విమానం కూలినప్పటి నుంచి ఆందోళన మరింత పెరిగింది. 2025 సంక్షోభ సంవత్సరం కాబోతోందని చాలా మంది ఫ్యూచరిస్టులు చెబుతూనే ఉన్నారు. 2025 ఏడాది ముగిసిపోడానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. మరి ఈ ఆరు నెలల్లో ఏమేం జరగనున్నాయి.
(3 / 6)
ఇది బాబా వంగా యవ్వనంగా ఉన్నప్పటి చిత్రం. అయితే 1996లో బాబా వంగా చనిపోయారు. అయినప్పటికీ ఆమె చెప్పిన మాటలు ఇప్పటికి సరిపోలుతూనే ఉన్నాయి. 2025 ప్రారంభంలో నేపాల్-టిబెట్ సరిహద్దులో భూకంపం, ఆ తర్వాత మయన్మార్-థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంతో సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఇవే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోనూ కరోనా మళ్లీ విజృంభిస్తోంది.
(4 / 6)
మరి ఇంకా ఈ ఏడాది ఏం జరగనుందో బాబా వంగా చెప్పిన విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 2025 నాటికి పాశ్చాత్య, తూర్పు దేశాల మధ్య పెద్ద యుద్ధమే జరిగే అవకాశం ఉందని బాబా వంగా అన్నారు. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చనే భయం కూడా ఉందని తెలుస్తోంది.
(5 / 6)
2025లో యూరప్ నుంచి ఇస్లాం ప్రపంచం మొత్తానికి వ్యాపిస్తుందని బాబా వంగా జోస్యం చెప్పారు. 2043 నాటికి 44 దేశాల్లో ముస్లిం ప్రాబల్యం ఏర్పడుతుంది. అయితే, 2076 నాటికి కమ్యూనిస్టు పాలన మళ్లీ ప్రపంచంలోకి రావచ్చు. 5079 నాటికి ప్రపంచం మొత్తం నాశనమవుతుందని బాబా వంగా చెప్పారు.
(6 / 6)
2025లో గ్రహాంతరవాసులు (ఏలియన్స్) తిరిగి వస్తారని బాబా వంగా జోస్యం చెప్పారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వేర్వేరు నక్షత్రాలు వినాశనం అవ్వడం లేదా వినాశనాన్ని తీసుకురావడం వంటివి జరగుతాయట. దీంతో భవిష్యత్తులో ఇంకా ఏం జరగనున్నాయనే భయం అందరిలో మెదులుతోంది. ఏదైనా ధైర్యంగా పోరాడటమే అని బాబా వంగా ఉపదేశించారు.
ఇతర గ్యాలరీలు