
(1 / 5)
బల్గేరియాకు చెందిన బాబా వంగా 1911లో పుట్టి, 1996లో మరణించింది. అయితే ఆమె 5 వేల సంవత్సరం వరకు కూడా భవిష్యత్తును అంచనా వేసిందని, వాటిలో ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయని నమ్ముతారు. మరి ఇండియా గురించి, అందులోనూ 2026 ఏడాది గురించి ఆమె ఏం చెప్పిందో చూడండి.

(2 / 5)
2026 గురించి బాబా వంగా అంచనాల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని రిపోర్టులు వచ్చాయి. వాటి ప్రకారం ఇండియాలో బాబా వంగా వచ్చే ఏడాది ప్రకృతి వైపరీత్యాలు జరగబోతున్నాయని అంచనా వేసినట్లుగా ఉంది.

(3 / 5)
2026లో కూడా మన దేశం భారీ వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని బాబా వంగా అంచనా వేసింది. రికార్డు వేడి, రికార్డు వర్షాల వల్ల ప్రజా జీవితం దెబ్బతిననుంది. అంతే కాదు ఇండియాలోని అనేక నగరాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి. గత కొన్ని నెలలుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నందున బాబా వంగా అంచనాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

(4 / 5)
బాబా వంగా 1996 ఆగస్టు 11 న రొమ్ము క్యాన్సర్ తో మరణించింది. నిజానికి తన మరణాన్ని కూడా ఆమె ముందుగానే ఊహించిందని చెబుతారు.

(5 / 5)
బాబా వంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా అప్పట్లోనే అంచనా వేసింది. 2026, 2028 మధ్య చైనా శక్తి యునైటెడ్ స్టేట్స్ ను అధిగమిస్తుందని చెప్పడం గమనార్హం.
ఇతర గ్యాలరీలు