(1 / 8)
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంచే ఆహార పదార్థాలను తినాలని పోషకాహార నిపుణులు. అయితే వేడి వాతావరణంలో కొన్ని కూరగాయలు ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. ఏ కూరగాయలు తక్కువగా తినాలో తెలుసుకోండి.
(2 / 8)
అన్ని రకాల వంటకాల్లో బేసిక్ వెజిటేబుల్ గా ఉపయోగించేవి ఉల్లిపాయలు. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి ఇవి. కాబట్టి మితంగా వాడితే మంచిది.
(3 / 8)
వెల్లుల్లి వేడి స్వభావం కారణంగా వేసవిలో దీన్ని తక్కువగా తినాలి. వేసవిలో వెల్లుల్లి ఎక్కువగా తినడం వల్ల శరీరంపై దద్దుర్లు వస్తాయి.
(4 / 8)
వంటలోనే కాదు, టీలో కూడా అల్లాన్ని భాగం చేసుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే వేడి వాతావరణంలో దీన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అల్లం వేడి స్వభావం కారణంగా ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచి సమస్యలను కలిగిస్తుంది.
(5 / 8)
కాలీఫ్లవర్ వేడి స్వభావం కలిగి ఉంటుంది. వేసవిలో కాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి జీర్ణ సమస్యలు వస్తాయి.
(6 / 8)
బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ హీట్ పెరిగి చర్మం, జీర్ణ సమస్యలు వస్తాయి.
(7 / 8)
పచ్చిమిరపకాయలు ఆరోగ్యానికి మంచివే. కానీ వేసవిలో వీటిని అధికంగా తింటే శరీరానికి వేడిని కలిగిస్తుంది. పచ్చి మిర్చి అధికంగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
(8 / 8)
పుట్టగొడుగులకు వేడి స్వభావం ఉంటుంది. దీని కారణంగా శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి తక్కువ పరిమాణంలో తినాలి.
ఇతర గ్యాలరీలు