
(1 / 5)
ఆస్ట్రేలియా స్టార్ వుమెన్ క్రికెటర్ గార్డ్‌నర్ పెళ్లి చేసుకుంది. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ మోనికాను వివాహం చేసుకుంది. ఆదివారం (ఏప్రిల్ 6) ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ జోడీ ఒక్కటైంది. ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న ఈ జంట.. మిసెస్ అండ్ మిసెస్ గార్డ్‌నర్ అని క్యాప్షన్ ఇచ్చింది.
(instagram-little.bit.of.monicaa)
(2 / 5)
గార్డ్‌నర్, మోనికా గతేడాది ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. 2024 ఏప్రిల్ లో రింగ్స్ మార్చుకున్నారు.
(instagram-little.bit.of.monicaa)
(3 / 5)
గార్డ్‌నర్, మోనికా చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా కలిసే ఉంటున్నారు. వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
(instagram-little.bit.of.monicaa)
(4 / 5)
గార్డ్‌నర్, మోనికా పెళ్లికి ఆస్ట్రేలియా వుమెన్ క్రికెటర్లు అటెండ్ అయ్యారు. అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, కిమ్ గార్థ్ తదితర స్టార్ క్రికెటర్లు ఈ పెళ్లిలో సందడి చేశారు.
(instagram-little.bit.of.monicaa)
(5 / 5)
2017లో టీ20 మ్యాచ్ తో గార్డ్‌నర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటివరకూ ఆమె 7 టెస్టులు, 77 వన్డేలు, 96 టీ20 మ్యాచ్ లు ఆడింది. ఇండియాలో ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ 2025లో ఆమె గుజరాత్ జెయింట్స్ కు కెప్టెన్ గా ఆడింది.
(instagram-little.bit.of.monicaa)ఇతర గ్యాలరీలు