Australian Open 2025: ప్రపంచ నంబర్ వన్‍కు షాకిచ్చి తొలి గ్రాండ్‍స్లామ్ గెలిచిన మ్యాడిసన్.. భారీ ప్రైజ్‍మనీ!
- Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‍ను మ్యాడిసన్ కీస్ కైవసం చేసుకున్నారు. తన కెరీర్లో తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ దక్కించుకున్నారు.
- Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‍ను మ్యాడిసన్ కీస్ కైవసం చేసుకున్నారు. తన కెరీర్లో తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ దక్కించుకున్నారు.
(1 / 6)
టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 2025 టోర్నీ ఛాంపియన్‍గా అమెరికాకు చెందిన 14వ ర్యాంక్ ప్లేయర్ మ్యాడిసన్ కీస్ నిలిచారు. తన కెరీర్లో తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ కైవసం చేసుకున్నారు.
(AFP)(2 / 6)
శనివారం (జనవరి 25) జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‍లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ అర్యానా సబలెంకాకు షాక్ ఇచ్చారు మ్యాడిసన్. మూడు సెట్ల పాటు పోరాడి గెలిచారు.
(AFP)(3 / 6)
ఫైనల్‍లో మ్యాడిసన్ కీస్ 6-3, 2-6, 7-5 తేడాతో బెలారస్ స్టార్ సబలెంకపై విజయం సాధించారు. గత రెండు సంవత్సరాలు ఆస్ట్రేలియా టైటిల్ గెలిచిన సబలెంకకు ఈసారి ఫైనల్‍లో ఎదురుదెబ్బ తగిలి.. హ్యాట్రిక్ మిస్ అయింది.
(REUTERS)(4 / 6)
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన మ్యాడిసన్ కీస్ 2.22 మిలియన్ డాలర్లు (సుమారు రూ.19 కోట్ల) ప్రైజ్‍మనీ దక్కింది. భారీ మొత్తాన్ని కీస్ అందుకున్నారు.
(AFP)(5 / 6)
రన్నరప్‍గా నిలిచిన ఆర్యనా సబలెంకకు 1.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.10కోట్లు) ప్రైజ్‍మనీ కైవసం అయింది.
(AP)ఇతర గ్యాలరీలు