Atchutapuram SEZ Accident : అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు-14కు చేరిన మృతుల సంఖ్య, 50 మందికి గాయాలు
- Atchutapuram SEZ Accident : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృత్యుల సంఖ్య 14కు పెరిగింది. బుధవారం మధ్యాహ్నం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా కార్మికులకు గాయపడ్డారు.
- Atchutapuram SEZ Accident : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృత్యుల సంఖ్య 14కు పెరిగింది. బుధవారం మధ్యాహ్నం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా కార్మికులకు గాయపడ్డారు.
(1 / 6)
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృత్యుల సంఖ్య 14కు పెరిగింది. బుధవారం మధ్యాహ్నం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా కార్మికులకు గాయపడ్డారు. గాయపడిన వారి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.
(2 / 6)
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఉన్న ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులను ఎన్టీఆర్ ఆస్పత్రికి, సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
(3 / 6)
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
(4 / 6)
అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సుమారు 1:30 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ప్రాణభయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం.
(5 / 6)
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
ఇతర గ్యాలరీలు