Maharashtra bus crash: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం; 25 మంది సజీవ దహనం; ఫొటోలు-at least 25 dead after bus crash and catch fire on maharashtra expressway ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maharashtra Bus Crash: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం; 25 మంది సజీవ దహనం; ఫొటోలు

Maharashtra bus crash: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం; 25 మంది సజీవ దహనం; ఫొటోలు

Jul 01, 2023, 05:52 PM IST HT Telugu Desk
Jul 01, 2023, 05:52 PM , IST

Maharashtra bus crash: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వేగంగా వెళ్తుండగా టైర్ పేలిపోయింది. దాంతో, బస్సు  అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్నది. వెంటనే ఆ బస్సుకు మంటలంటుకుని క్షణాల్లో బస్సంతా వ్యాపించాయి. 

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరిశీలించారు.

(1 / 7)

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరిశీలించారు.(ANI)

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. 

(2 / 7)

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. (ANI)

పూర్తిగా అగ్నికి ఆహుతై పోయిన బస్సు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో సమృద్ధి - మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది.

(3 / 7)

పూర్తిగా అగ్నికి ఆహుతై పోయిన బస్సు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో సమృద్ధి - మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది.(AFP)

పూర్తిగా కాలిపోయిన బస్సును పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. బస్సు డ్రైవర్, కండక్టర్ లను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

(4 / 7)

పూర్తిగా కాలిపోయిన బస్సును పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. బస్సు డ్రైవర్, కండక్టర్ లను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (PTI)

ప్రమాదంలో పూర్తిగా తగలబడిపోయిన బస్సు. నాగపూర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

(5 / 7)

ప్రమాదంలో పూర్తిగా తగలబడిపోయిన బస్సు. నాగపూర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.(ANI)

ప్రమాదం జరిగిన సమయంలో ఈ ప్రైవేటు బస్సులో మొత్తం 33 మంది ఉన్నారు. వారిలో ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతావారు గాయాలతో చికిత్స పొందుతున్నారు.

(6 / 7)

ప్రమాదం జరిగిన సమయంలో ఈ ప్రైవేటు బస్సులో మొత్తం 33 మంది ఉన్నారు. వారిలో ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతావారు గాయాలతో చికిత్స పొందుతున్నారు.(AFP)

వేగంగా వెళ్తున్న బస్సు టైర్ పేలిపోవడంతో, బస్సు వెళ్లి డివైడర్ కు ఢీకొన్నదని, దాంతో, బస్సు డీజిల్ ట్యాంక్ కు మంటలు అంటుకున్నాయని, అనంతరం అవి బస్సు అంతా వ్యాపించాయని ప్రాథమికంగా నిర్ధారించారు.

(7 / 7)

వేగంగా వెళ్తున్న బస్సు టైర్ పేలిపోవడంతో, బస్సు వెళ్లి డివైడర్ కు ఢీకొన్నదని, దాంతో, బస్సు డీజిల్ ట్యాంక్ కు మంటలు అంటుకున్నాయని, అనంతరం అవి బస్సు అంతా వ్యాపించాయని ప్రాథమికంగా నిర్ధారించారు.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు