Asia Cup Final: ఆసియాకప్ ఫైనల్‍లో లంకపై భారత్ ఘన విజయం.. టీమిండియా సెలెబ్రేషన్స్: ఫొటోలు
Asia Cup Final: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో 263 బంతులను మిగిల్చి టీమిండియా విజయం సాధించింది. 8వసారి భారత్ ఆసియాకప్ టైటిల్ దక్కించుకుంది. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో విజృంభించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది.
(1 / 6)
ఆసియాకప్ 2023 ఫైనల్‍లో నేడు శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 8వసారి ఆసియాకప్ టైటిల్ సాధించింది. అత్యధిక ఆసియా టైటిళ్లను దక్కించుకున్న జట్టుగా రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఆసియాకప్ ట్రోఫీని అందుకున్న తర్వాత భారత ఆటగాళ్లు.. సంబరాలు చేసుకున్నారు. కేరింతలు కొట్టారు. (AP)
(2 / 6)
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జైషా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆసియాకప్ టైటిల్ అందిస్తున్న దృశ్యం. పక్కనే ఉన్న భారత ఆటగాళ్లు కేరింతల హోరు చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్‍లో మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగటంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలోనే 50 పరుగులకే ఆలౌటైంది.(PTI)
(3 / 6)
ఈ మ్యాచ్‍లో భారత పేసర్ సిరాజ్.. నాలుగో ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. వన్డేలో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అనంతరం మరో వికెట్ తీసి.. ఓ వన్డే మ్యాచ్‍లో అత్యంత వేగంగా (16 బంతుల్లో) ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును (చమింద వాస్) సమం చేశాడు. సిరాజ్ విజృంభణతో ఓ దశలో శ్రీలంక 12 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. (AFP)
(4 / 6)
శ్రీలంకతో ఈ ఆసియాకప్ 2023 పైనల్‍లో ఏడు ఓవర్లు వేసిన సిరాజ్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. (AFP)
(5 / 6)
భారత ఆల్‍రౌండర్ హార్దిక్ పాండ్యా మూడు, బుమ్రా ఓ వికెట్ తీశారు. మొత్తంగా శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. 51 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 6.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించి గెలిచింది.(AP)
ఇతర గ్యాలరీలు