Hindustan Times Centennial Debate: హిందుస్తాన్ టైమ్స్ సెంటినియల్ డిబేట్ మొదటి రౌండ్ విజేత అశోక యూనివర్సిటీ
Hindustan Times Centennial Debate: ప్రఖ్యాత దిన పత్రిక హిందుస్తాన్ టైమ్స్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు, పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హిందుస్థాన్ టైమ్స్ శతాబ్ది డిబేట్ ను కూడా నిర్వహించారు. ఈ పోటీలో తొలి రౌండ్ లో అశోక యూనివర్సిటీ విజయం సాధించింది.
(1 / 5)
హిందుస్థాన్ టైమ్స్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం బికనీర్ హౌస్ లో హిందుస్థాన్ టైమ్స్ శతాబ్ది డిబేట్ తొలి రౌండ్ ను నిర్వహించారు. ఢిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ రౌండ్ లో అశోక యూనివర్శిటీ విద్యార్థులు డిబేట్ లో విజయం సాధించారు.
(2 / 5)
జ్యూరీలో జీ20 అధినేత అమితాబ్ కాంత్, సీనియర్ జర్నలిస్ట్ సోనియా సింగ్, వ్యాపారవేత్త సుహెల్ సేథ్ సభ్యులుగా ఉన్నారు.
(3 / 5)
ఈ చర్చలో పాల్గొన్న విద్యార్థులు ‘యువత, సమాజంపై సోషల్ మీడియా ప్రభావం’ అనే అంశంపై భిన్న దృక్పథాలను ప్రదర్శిస్తూ వివిధ వాదనలను వినిపించారు.
(4 / 5)
ఈ చర్చలో పాల్గొన్న విద్యార్థులు యువత మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా నష్టాలను ఎత్తిచూపారు. అదే సమయంలో సోషల్ మీడియాతో లాభాలను కూడా పలువురు విద్యార్థులు తెలిపారు. సోషల్ మీడియా గాజా సంక్షోభం వంటి సమస్యలపై అవగాహన పెంచుతుందని వాదించారు.
ఇతర గ్యాలరీలు