(1 / 7)
Arya 20 Years Celebrations: టాలీవుడ్‌లో ఆర్య మూవీ ఓ గేమ్ ఛేంజర్ అన్నాడు అల్లు అర్జున్. ఆర్య 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లో అతడు మాట్లాడాడు. "ఆ రోజుల్లో 10 వారాలు నడిస్తే సినిమా యావరేజ్ అనేవాళ్లు. సుకుమార్, నేను ఆర్య ఫస్ట్ షోకి వెళ్లినప్పుడు థియేటర్ 40 శాతమే నిండింది. మెల్లగా పికప్ అవుతుందని మేము భావించాం. షో పూర్తయిన తర్వాత ఇది 10 వారాల మూవీ అన్నారు. దీంతో నేను చాలా నిరాశ చెందాను" అని అల్లు అర్జున్ అన్నాడు.
(2 / 7)
Arya 20 Years Celebrations: అప్పుడు తన తండ్రి అల్లు అరవింద్ మాటలను కూడా బన్నీ గుర్తు చేసుకున్నాడు. "చాలా వరకు కొత్త వాళ్లతో తీసిన సినిమా పది వారాలు ఆడటం కూడా చిన్న విషయం కాదని అల్లు అరవింద్ గారు చెప్పారు. కానీ ఆర్య 125 రోజులు ఆడుతుందని అన్నాను. అదే జరిగింది. నేను చిరంజీవిగారి చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నాను. టాలీవుడ్ లో ఈ మూవీ ఓ గేమ్ ఛేంజర్. దిల్ రాజును ఈ సినిమా స్టార్ ప్రొడ్యూసర్ చేసింది. నా జీవితంలో సుకుమార్ ను పెద్ద పిల్లర్ గా మార్చేసింది" అని అల్లు అర్జున్ అన్నాడు.
(3 / 7)
Arya 20 Years Celebrations: సుకుమార్ పై ప్రశంసలు కురిపించాడు అల్లు అర్జున్. "ఇప్పుడు సుకుమార్ గారు టాప్ లో ఉన్నారు. ఇండియాలో నంబర్ వన్ డైరెక్టర్ దిశగా వెళ్తున్నారు. దేశంలోని పెద్ద సినిమాలను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చే మ్యూజిక్ డీఎస్పీ అందిస్తున్నాడు. సుకుమార్ గారు లేకుండా ఇవేవీ సాధ్యమయ్యేది కాదు. టీమ్ మొత్తానికి నా కృతజ్ఞతలు. చిరంజీవి గారు అందించిన నైతిక మద్దతకు ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని అల్లు అర్జున్ చెప్పాడు.
(4 / 7)
Arya 20 Years Celebrations: ఈ సందర్భంగా సుకుమార్ కూడా అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు. అల్లు అర్జున్ వల్లే ఈ రోజు తానీ స్థాయిలో ఉన్నానని సుకుమార్ చెప్పడం గమనార్హం. ఆర్య మూవీపై తనకే నమ్మకం లేకపోయినా.. అప్పట్లో 18 ఏళ్ల వయసు ఉన్న బన్నీ స్క్రిప్ట్ ను నమ్మి కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పాడని కూడా సుకుమార్ గుర్తు చేసుకున్నాడు.
(5 / 7)
Arya 20 Years Celebrations: ఆర్య మూవీ కోసం తాను ఏది అడిగినా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇచ్చాడని, ఇక ఫస్ట్ హాఫ్ వినగానే డీఎస్పీ ఫీల్ మై లవ్ సాంగ్ చేశాడని సుకుమార్ చెప్పాడు. ఐటెమ్ సాంగ్ పెట్టాలన్న ఉద్దేశం తనకు లేకపోయినా.. అ అంటే అమలాపురం పెద్ద హిట్ అయినట్లు గుర్తు చేసుకున్నాడు.
(6 / 7)
Arya 20 Years Celebrations: అల్లు అర్జున్, సుకుమార్ కలిసి ఆర్యతోపాటు పుష్పలాంటి పాన్ ఇండియా హిట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు పుష్ప 2తో మరోసారి దేశవ్యాప్తంగా అగ్గి పుట్టించడానికి ఈ కాంబినేషన్ సిద్ధమవుతోంది. ఆర్య మూవీ మే 7, 2004లో రిలీజైన విషయం తెలిసిందే.
(7 / 7)
Arya 20 Years Celebrations: ఆర్య మూవీలో కీలకపాత్ర పోషించిన బాలాజీ కూడా ఈ 20 ఏళ్ల సంబరాలకు హాజరయ్యాడు. తన భార్యతో కలిసి అతడు వచ్చాడు.
ఇతర గ్యాలరీలు