Arunachalam Tour Package : అరుణాచలం, వేలూరు, కాణిపాకం ట్రిప్ - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ, జర్నీ ఎప్పుడంటే..?
- అరుణాచలం వేళ్లే భక్తులకు తెలంగాణ టూరిజం మరో అప్డేట్ ను ఇచ్చింది. ఇదే జనవరి నెలలో రెండోసారి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. హైదరాబాద్ నుంచి జనవరి 30, 2025వ తేదీన ట్రిప్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
- అరుణాచలం వేళ్లే భక్తులకు తెలంగాణ టూరిజం మరో అప్డేట్ ను ఇచ్చింది. ఇదే జనవరి నెలలో రెండోసారి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. హైదరాబాద్ నుంచి జనవరి 30, 2025వ తేదీన ట్రిప్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
(1 / 7)
అరుణాచలం వేళ్లే వారికి తెలంగాణ టూరిజం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఇదే జనవరి నెలలో మరోసారి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ నెల జనవరి 10వ తేదీ ట్రిప్ ఆపరేట్ చేయగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది.
(image source Twitter)(2 / 7)
హైదరాబాద్ నుంచి జనవరి 30, 2025వ తేదీన అరుణాచలం ట్రిప్ అందుబాటులో ఉంటుందని తెలంగాణ టూరిజం తెలిపింది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది.
(image source from @hinduacademy X )(3 / 7)
ఇందులో భాగంగా అరుణాచలేశ్వర ఆలయం, కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వాళ్లు హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సి ఉంటుంది తొలిరోజు బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు జర్నీ ప్రారంభమవుతుంది.
రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత ఉదయం 9 గంటల లోపు దర్శనం పూర్తి చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.
(4 / 7)
మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రి అరుణాచలంలోనే బస ఉంటుంది. మూడో రోజు ఉదయం టిఫిన్ పూర్తి కాగానే అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు బయలు దేరుతారు. సాయంత్రం దర్శనం పూర్తి అవుతుంది. వెంటనే తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 4వ రోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది
(5 / 7)
ఈ టూర్‌లో పెద్దలకు ప్యాకేజీని రూ.8,000, పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్స్ కవర్ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతంగా ఖర్చు భరించాల్సి ఉంటుంది.
(6 / 7)
ఈ ప్యాకేజీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
(Image Source From Arunachalam Temple FB Page)(7 / 7)
హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/package/hydarunachalam
ఇతర గ్యాలరీలు