Arunachalam Tour Package : హైదరాబాద్ టు అరుణాచలం - ఈనెలలోనే ట్రిప్, తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ ఇదే!
- ఈ నెలలో తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నగరం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. నాలుగు రోజులు ట్రిప్ ఉంటుంది. తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి...
- ఈ నెలలో తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నగరం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. నాలుగు రోజులు ట్రిప్ ఉంటుంది. తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి...
(1 / 7)
ఈ దసరా పండ వేళ తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకునే ప్లాన్ ఉందా..? అలాంటి వారికి తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలం వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది.
(2 / 7)
4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. (image source https://annamalaiyar.hrce.tn.gov.in/)
(3 / 7)
ఈ అక్టోబర్ నెలలో చూస్తే 14వ తేదీన జర్నీ ఉండనుంది. 12వ తేదీన దసరా పండగ ఉంది. ఈ తేదీ మిస్ అయితే నవంబర్ లో వెళ్లొచ్చు. అందుకు అనుగుణంగా టికెట్లను ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు.(image source https://annamalaiyar.hrce.tn.gov.in/)
(4 / 7)
తొలి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.(image source https://annamalaiyar.hrce.tn.gov.in/)
(5 / 7)
4వ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.(image source https://annamalaiyar.hrce.tn.gov.in/)
(6 / 7)
హైదరాబాద్ - అరుణాచంల టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.(image source https://annamalaiyar.hrce.tn.gov.in/)
ఇతర గ్యాలరీలు