TG Indiramma Housing Scheme : లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం వరకు...! ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో AI టెక్నాలజీ
- Telangana Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా కసరత్తు చేస్తోంది. అర్హులకు మాత్రమే స్కీమ్ ను వర్తింపజేసే విధంగా చూసే పనిలో పడింది. ఇందుకోసం ఏఐ(కృతిమ మేధ) సేవలను వాడనుంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఈ సేవలను వినియోగించాలని నిర్ణయించింది.
- Telangana Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా కసరత్తు చేస్తోంది. అర్హులకు మాత్రమే స్కీమ్ ను వర్తింపజేసే విధంగా చూసే పనిలో పడింది. ఇందుకోసం ఏఐ(కృతిమ మేధ) సేవలను వాడనుంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఈ సేవలను వినియోగించాలని నిర్ణయించింది.
(1 / 8)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కింది. ఇటీవలే లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొందరికి ప్రోసిడింగ్స్ కాపీలను కూడా అందజేశారు.
(2 / 8)
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాల్లోని ఒక గ్రామంలో లబ్ధిదారులను గుర్తించారు. ఈ మేరకు కొందరికి ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు. ఇక అన్ని గ్రామాలకు సంబంధించిన జాబితాలపై కసరత్తు జరుగుతోంది.
(3 / 8)
అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రాథమిక జాబితాలు రాగా… ఇందులో ఉన్న పేర్లను మళ్లీ పరిశీలించనున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి… లబ్ధిదారుల జాబితాలను తయారు చేయనున్నారు.
(4 / 8)
లబ్ధిదారుల జాబితా తయారీలో ఇందిరమ్మ ఇంటి కమిటీలు కీలకంగా ఉండనున్నాయి. వీరి సహాయంతో క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన చేసి లిస్ట్ ఫైనల్ చేస్తారు.
(5 / 8)
లబ్ధిదారులను ఫైనల్ చేసే క్రమంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. లబ్ధిదారులను గుర్తించే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడాలని నిర్ణయించింది. ఇదే విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
(6 / 8)
లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఏఐ సేవలు వినియోగించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.
(7 / 8)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్మ లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా టెక్నాలజీని వాడుకోవాలని పొంగులేటి దిశానిర్దేశం చేశారు. యాప్ సర్వే వివరాలను క్షణ్ణంగా పరిశీలించాలని… క్లౌడ్ ఆధారిత ఏఐ టెక్నాలజీతో సరిపోలుస్తూ లబ్ధిదారులను గుర్తించాలన్నారు.
(8 / 8)
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి సందేహాలు నివృత్తి చేయడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం 040-29390057 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుపొచ్చు. https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదులను కూడా స్వీకరిస్తారు.
ఇతర గ్యాలరీలు