Arshdeep Singh Record: చహల్ రికార్డును బ్రేక్ చేసిన అర్ష్‌దీప్ సింగ్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు
- Arshdeep Singh Record: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో యుజ్వేంద్ర చహల్ ఆల్ టైమ్ రికార్డును అర్ష్‌దీప్ సింగ్ బ్రేక్ చేశాడు.
- Arshdeep Singh Record: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో యుజ్వేంద్ర చహల్ ఆల్ టైమ్ రికార్డును అర్ష్‌దీప్ సింగ్ బ్రేక్ చేశాడు.
(1 / 5)
Arshdeep Singh Record: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ తీయడం ద్వారా యుజ్వేంద్ర చహల్ ఆల్ టైమ్ రికార్డును సమం చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బెన్ డకెట్ ను ఔట్ చేయడం ద్వారా చహల్ ను అధిగమించాడు.
(AP)(2 / 5)
Arshdeep Singh Record: ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. తొలి టీ20లో రెండు వికెట్లు తీయడం ద్వారా 61 టీ20ల్లో అతని మొత్తం వికెట్ల సంఖ్య 97కు చేరింది. 96 వికెట్లతో చహల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.
(AFP)(3 / 5)
Arshdeep Singh Record: అర్ష్‌దీప్ కు ముందు చహల్ 80 మ్యాచ్ లలో 96 వికెట్లతో టాప్ లో ఉండేవాడు. ఇంగ్లండ్ తో తొలి టీ20లో రెండు వికెట్లు తీయడం ద్వారా అర్ష్‌దీప్ ఇప్పుడా రికార్డును అందుకున్నాడు.
(AFP)(4 / 5)
Arshdeep Singh Record: టీ20ల్లో అర్ష్‌దీప్, చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతడు 86 ఇన్నింగ్స్ లో 90 వికెట్లు తీశాడు.
(AFP)ఇతర గ్యాలరీలు