
(1 / 5)
జూన్ 9, ఆదివారం, సాయంత్రం 6 గంటలకు.. ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు.
(HT_PRINT)
(2 / 5)
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు.
(HT_PRINT)
(3 / 5)
వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టే రెండో భారతీయుడిగా నిలుస్తారు మోదీ. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. 1952, 1957, 1962 ఎన్నికల్లో గెలిచి మూడుసార్లు ప్రధానిగా చేశారు.
(Tharun Vinny)
(4 / 5)
ఇక ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడితో పాటు వివిధ దేశాలకు చెందిన కీలక నేతలు హాజరవుతారని సమాచారం.
(HT_PRINT)
(5 / 5)
మోదీ కేబినెట్లో ఈసారి పలు కీలక మార్పులు కనిపిస్తాయి. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో.. ఎన్డీఏ పక్ష పార్టీలు కీలక పదవులకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుంది.
(ANI)ఇతర గ్యాలరీలు