Student loan : చదువు కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి
Hidden charges in student loan : మీరు చదువు కోసం ఒక స్టూడెంట్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? దాని కన్నా ముందు.. మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఛార్జీల మోత గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. జ్ఞాన్ధాన్ సీఈఓ అంకిత్ మెహ్రా మాటల్లో వాటి గురించి తెలుసుకుందాము..
(1 / 7)
ప్రాసెసింగ్ ఫీజ్:- ఎడ్జ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కోసం బ్యాంక్‌లు ఈ ప్రాసెసింగ్ ఫీజ్‌ను ఛార్జ్ చేస్తాయి. ఇది సాధారణమైన విషయం. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఉండొచ్చు, లేదా లోన్ అమౌంట్లో పర్సెంటేజ్ కింద ఉండొచ్చు. అయితే.. కొంతమంది ప్రాసెసింగ్ ఫీజ్‌తో పాటు సర్వీస్ ఛార్జీలు కూడా వసూలు చేస్తుంటారు.
(2 / 7)
ప్రీపేమెంట్ ఛార్జెస్:- తీసుకున్న లోన్‌ను నిర్ణిత సమయం కన్నా ముందే చెల్లించేస్తుంటే.. ప్రీపేమెంట్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఎడ్జ్యుకేషన్ లోన్‌లో సాధారణంగా ఇలాంటివి ఉండవు. కానీ టర్మ్స్ అండ్ కండీషన్లను ఓసారి చూసుకుంటే మంచిది.
(3 / 7)
లేట్ పేమెంట్:- ఈఎంఐలను సకాలంలో కట్టకపోయినా అదనపు ఛార్జీలు వేస్తుంటారు. ఇది ఈఎంఐ + జీఎస్టీ అమౌంట్లో 2-3శాతం ఉంటుంది.
(4 / 7)
లోన్ ఇన్ష్యూరెన్స్:- అనుకోని సందర్భాల్లో లోన్ని తీర్చలేకపోతుంటే.. ఈ బీమా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో ఇది కూడా సాధారణమైపోయింది. అయితే.. ఇది లేకపోతే అదనపు వడ్డీలు పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బ్యాంక్‌లలో ఈ వడ్డీ 0.05-0.25శాతం ఉండగా.. ప్రైవేటు బ్యాంక్‌లలో 2శాతం వరకు ఉండొచ్చు.
(5 / 7)
మార్టిగేజ్ క్రియేషన్ ఛార్జెస్:- కొలాటరల్ మీద ఎడ్జ్యూకేషన్ లోన్ తీసుకుంటే.. ఈ ఛార్జీలు వేస్తారు. లోన్ అమౌంట్లో ఇది 0.25- 0.3శాతం ఉండొచ్చు. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ ఛార్జీలను ప్రభుత్వాలు ఎత్తివేశాయి.
(6 / 7)
ప్రాపర్టీ ఇన్ష్యూరెన్స్:- లోన్ తీసుకునేటప్పుడు ఏదైనా పాత ప్రాపర్టీని హామీగా పెడుతుంటే.. దానిపై ప్రాపర్టీ ఇన్ష్యూరెన్స్‌ను విధిస్తున్నాయి బ్యాంక్‌లు.
(7 / 7)
సప్లిమెంటరీ ఇన్ష్యూరెన్స్:- లోన్ తీసుకునేటప్పుడే.. సంబంధిత వ్యక్తులకు హెల్త్, ట్రావెల్ వంటి ఇన్ష్యూరెన్స్లను తీసుకోవాలని బ్యాంక్‌లు చెబుతుంటాయి. కచ్చితంగా తీసుకోవాలి అని ఏం లేదు.
ఇతర గ్యాలరీలు