
(1 / 7)
తలకు దిండుపెట్టుకొని నిద్రపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే కొంతమందికి పక్కన దిండు పెట్టుకోనిదే నిద్రపోలేరు. ఇలా సైడ్ దిండుతో నిద్రపోయే అలవాటు మీకుందా? అయితే ఇది చదవండి.

(2 / 7)
పక్క దిండుతో నిద్రిస్తే శరీరానికి ఒక విధంగా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ అలవాటు చాలా మంచిది. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.

(3 / 7)
కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకోవడం వలన వెన్నెముకకు సహాయపడుతుంది. వెన్ను నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

(4 / 7)
కాళ్ల మధ్యలో దిండు లేదా సైడ్ దిండుతో నిద్రించడం వలన సయాటిక్ నరాల నొప్పిని తగ్గిస్తుంది. ఇది వెనుక కండరాలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

(5 / 7)
మీరు హాయిగా నిద్రపోవాలనుకుంటున్నారా? అప్పుడు సైడ్ దిండుతో పడుకోండి. త్వరగా నిద్రపడుతుంది.

(6 / 7)
గర్భిణీ స్త్రీలు వారి కాళ్ళ మధ్య దిండు లేదా సైడ్ దిండుతో నిద్రించమని నిపుణులు సలహా ఇస్తారు. ఇది నిద్రలో కూడా వారి గర్భాన్ని సురక్షిత స్థితిలో ఉంచుతుంది.

(7 / 7)
అయితే కచ్చితంగా పక్కన దిండు పెట్టుకొని నిద్రించమని ఇక్కడ చెప్పడం లేదు. మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా నిద్రపోండి. దిండును పెట్టుకోవాలనుకుంటే సరైన దిండును ఎంచుకోండి. లేదంటే కండరాలు పట్టేసే అవకాశం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు