Arasavalli Ratha Saptami : అంగరంగ వైభవంగా అరసవల్లి రథసప్తమి ఉత్సవాలు, ప్రత్యేక ఆకర్షణగా హెలీకాఫ్టర్ రైడ్
Arasavalli Ratha Saptami Utsav : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఉత్సవాలు 4వ తేదీ వరకూ జరగనున్నాయి. వివిధ రకాల వేషధారణలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
(1 / 8)
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 2 ప్రారంభమైన ఉత్సవాలు మూడ్రోజుల పాటు జరగనున్నాయి. తొలిరోజు ఆదివారం రథసప్తమి ఉత్సవాల శోభయాత్ర ఎంతో వైభవంగా సాగింది.
(2 / 8)
శ్రీకాకుళం చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా రథసప్తమి ఉత్సవాల శోభాయాత్ర సాగింది. వివిధ రకాల వేషధారణలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాలు, శకటాలు, ఆట పాటలతో అసరవల్లి ఆధ్యాత్మిక శోభ నింపింది.
(3 / 8)
అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ పండగగా 3 రోజుల పాటు రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నారు. 4వ తేదీతో ఉత్సవాలు ముగియనున్నాయి.
(4 / 8)
తొలిరోజు ఆదివారం అరసవల్లి 80 అడుగుల రోడ్డులో 5 వేల మందితో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(5 / 8)
తొలిసారి ఏర్పాటు చేసిన హెలీకాప్టర్ రైడ్ భక్తులకు కొత్త అనుభూతినిస్తుంది. ఒక్కో ట్రిప్పుకు ఏడుగురు ప్రయాణించేందుకు వీలుగా హెలీ రైడ్ ప్రారంభించారు. 8 నిమిషాల్లో ఏడు ఆలయాలను చూసేందుకు ఒకరికి టిక్కెట్ రూ.1800 ఏర్పాటుచేశారు.
(6 / 8)
మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీగఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
ఇతర గ్యాలరీలు