Araku Tourism : ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్న అరకు అందాలు, వంజంగి పాల మేఘాలు-త్వరలో పారా గ్లైడింగ్ కూడా
Araku Tourism : అరకు లోయలో మళ్లీ పర్యాటకం ఊపందుకుంది. అరకులోయను సందర్శించే పర్యాటకుల కోసం పాడేరు ఐడీటీఏ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పద్మాపురం ఉద్యానవనంలో కొత్తంగా హాట్ ఎయిర్ బెలూన్ ను ప్రారంభించారు. త్వరలో పారా మోటార్ గ్లైడింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఐటీడీఏ అధికారులు తెలిపారు.
(1 / 7)
అరకు లోయలో మళ్లీ పర్యాటకం ఊపందుకుంది. అరకులోయను సందర్శించే పర్యాటకుల కోసం పాడేరు ఐడీటీఏ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పద్మాపురం ఉద్యానవనంలో కొత్తగా హాట్ ఎయిర్ బెలూన్ ను ప్రారంభించారు.
(3 / 7)
అరకు లోయలో త్వరలో పారా మోటార్ గ్లైడింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఐటీడీఏ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టిందని, అరకు లోయను మరింతగా పర్యాటకులకు చేరువచేసేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయని అధికారులు అంటున్నారు.
(4 / 7)
అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి కొండలు పాల మేఘాలను తలపిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు క్యూకట్టారు. శీతాకాలం సమీపిస్తుండడంతో వాతావరణంలో మార్పులతో వంజంగి కొండల మేఘాలు అద్భుతంగా ఉన్నాయి.
(5 / 7)
ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వంజంగి మేఘాల కొండలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఇవాళ ఉదయం మేఘాల చాటున నుంచి సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున ఇక్కడికి తరలివచ్చారు.
(6 / 7)
ఇటీవల వర్షాలకు అరకు కొండల్లో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కొండలపై నుంచి జలధారాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అరకులోని పలు ప్రాంతాల్లో వాటర్ పాల్స్ చూసేందుకు ప్రకృతి ప్రేమికులు క్యూకడుతున్నారు.
ఇతర గ్యాలరీలు