Araku Festival 2025 : అరకు ఫెస్టివల్ కు అంతా రెడీ-మూడ్రోజుల చలి పండుగలో ప్రత్యేక కార్యక్రమాలు
Araku Festival 2025 : మంచు దుప్పట్లో అరకు లోయ అందాలు వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. చలికాలంలో అరకు లోయ అందాలు చూసేందుకు ఏపీ ప్రభుత్వం 'అరకు చలి ఉత్సవం' పేరిటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహిస్తున్నారు.
(1 / 6)
మంచు దుప్పట్లో అరకు లోయ అందాలు వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. చలికాలంలో అరకు లోయ అందాలు చూసేందుకు ఏపీ ప్రభుత్వం 'అరకు చలి ఉత్సవం' పేరిటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
(2 / 6)
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహిస్తున్నారు. అరకు లోయలో గిరిజన నృత్యాలు, హాట్ ఎయిర్ బెలూన్లు, అరకు కాఫీ రుచి, గులాబీ ప్రదర్శనలు, మారథాన్‌లు, సైక్లింగ్, కార్నివాల్‌లు ఏర్పాటుచేస్తున్నారు.
(3 / 6)
ఐదేళ్ల తర్వాత మళ్లీ అరకు ఉత్సవం నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 'అరకు చలి ఉత్సవము 2025' పేరిట మూడ్రోజుల పాటు నిర్వహించే ఫెస్ట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
(4 / 6)
అరకు ఉత్సవ్ నిర్వహణకు కోటి రూపాయలు మంజూరు చేస్తూ పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అరకు చలి ఉత్సవంతో పాటు ఫిబ్రవరి 23 నుంచి 25 తేదీ వరకూ మారేడుమిల్లిలో పర్యాటక కార్యక్రమాలు నిర్వహించేందుకు అల్లూరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం అనుమతి కోరారు.
(5 / 6)
అరకు ఉత్సవ్ లో భాగంగా దేశంలోని గిరిజనుల సాంప్రదాయాలు, ఆచారాలను ప్రదర్శించనున్నారు. అలాగే పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. జనవరి31న ఈ చలి ఉత్సవానికి ముందు, మారథాన్, స్పోర్ట్స్ ఈవెంట్‌లు, పెయింటింగ్, రంగోలి పోటీలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
(6 / 6)
ఉత్సవ్‌లో భాగంగా తొలిసారిగా ప్రైవేటు భాగస్వామ్యంతో హెలికాప్టర్ రైడ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకు స్థానికంగా ఉన్న హెలిప్యాడ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. చివరిగా 2020 ఫిబ్రవరిలో అరకు ఉత్సవ్ నిర్వహించారు. అప్పట్లో పర్యాటకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తిరిగి ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అరకు ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. అరకు ఉత్సవ్ కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు