Araku Coffee Stalls : పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు, సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం-araku coffee stalls in parliament a source of pride for ap says cm chandrababu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Araku Coffee Stalls : పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు, సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం

Araku Coffee Stalls : పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు, సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం

Published Mar 24, 2025 05:01 PM IST Bandaru Satyaprasad
Published Mar 24, 2025 05:01 PM IST

Araku Coffee Stalls In Parliament : పార్లమెంట్‌ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా అనుమతితో గిరిజన కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో రెండు అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా అనుమతితో గిరిజన కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో రెండు అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. సంగం 1, 2 కోర్టు యార్డ్ వద్ద స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా ఇటీవల అనుమతి ఇచ్చారు.

(1 / 6)

స్పీకర్ ఆదేశాలతో రెండు అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్‌సభ భవనాల డైరెక్టర్‌ కుల్‌ మోహన్‌ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు.

(2 / 6)

పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అరకు కాఫీ గురించి మన్ కీ బాత్‌లో ప్రస్తావించినందుకు ప్రధాని మోదీకి, పార్లమెంట్‌లో కాఫీ స్టాల్‌ ఏర్పాటకు అనుమతి ఇచ్చిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

(3 / 6)

పార్లమెంట్‌ ప్రాంగణంలో కాఫీ స్లాళ్లను ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ..."ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు ఎంతో గర్వకారణం. వారి అంకిత భావం, కృషి అరకు కాఫీని జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లింది" అన్నారు.

(4 / 6)

అరకు కాఫీ ఆస్వాదిస్తుంటే గిరిజన రైతుల స్ఫూర్తిదాయక ప్రయాణం గుర్తుకురావాలని సీఎం చంద్రబాబు అన్నారు. పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టా్ళ్లను ప్రారంభించేందుకు ప్రోత్సహించిన సీఎం చంద్రబాబుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కృతజ్ఞతలు చెప్పారు.

(5 / 6)

"అరకు కాఫీ పార్లమెంటులో తన స్థానాన్ని సంపాదించుకోవడం చూసి చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన GI-ట్యాగ్ ఆర్గానిక్ కాఫీ 1.5 లక్షల మంది గిరిజన రైతుల అంకితభావాన్ని, వారి గొప్ప వారసత్వాన్ని సూచిస్తుంది. అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో...GI ట్యాగ్‌ను పొందడం, గిరిజన రైతులకు మద్దతు ఇవ్వడం, ప్రపంచ వేదికలపై ప్రదర్శించడంలో సీఎం చంద్రబాబు తన దార్శనిక నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, కిరణ్ రిజుజు, స్పీకర్ ఓంబిర్లాకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ మద్దతు గిరిజన సమాజాలను ఉద్ధరిస్తుంది" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.

(6 / 6)

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు