తెలుగు న్యూస్ / ఫోటో /
APSRTC Sankranti Specials : సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులు-టికెట్లపై 10 శాతం రాయితీ
APSRTC Sankranti Specials : సంక్రాంతి సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీ దృష్ట్యా 7200 అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రానూపోనూ టికెట్లు ఒకేసారి ఆన్ లైన్ బుకింగ్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.
(1 / 6)
సంక్రాంతి సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీ దృష్ట్యా 7200 అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది.
(2 / 6)
జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు 3900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 2153 బస్సులు, బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.
(3 / 6)
తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది.
(4 / 6)
ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడంలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నాని ప్రకటించారు.
(5 / 6)
రానూపోనూ టికెట్లు ఒకేసారి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆన్ లైన్ బుకింగ్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. స్పెషల్ బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు.
ఇతర గ్యాలరీలు