(1 / 7)
అనంతపురం జిల్లాలోని కల్లు గీత కార్మికులు.. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు. ఫిబ్రవరి ఐదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. ఫిబ్రవరి 7న కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కలెక్టర్ సమక్షంలో లాటరీ తీస్తామని స్పష్టం చేశారు. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(2 / 7)
అనంతపురం జిల్లాలో 14 మద్యం షాపులను కల్లుగీత కార్మికులైన ఈడిగ, గౌడ్, గౌడ, గౌండ్ల, కళాలి కులస్థులకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(3 / 7)
ఈడిగకు 9, గౌడ్‌కు 2, గౌడ, గౌండ్ల, కళాలి కులస్థులకు ఒక్కొక్కటి చొప్పున దుకాణాలు కేటాయించారు. ఈడిగ కులస్థులు గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలు, కంబదూరు, గుమ్మఘట్ట, గుంతకల్లు రూరల్, రాప్తాడు, బెళుగుప్ప మండలాల్లో దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(4 / 7)
గౌడ కులస్థులు అనంతపురం నగర పాలక సంస్థ, గుత్తి రూరల్ మండలంలోని దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గౌడ రాయదుర్గం రూరల్, గౌండ్ల కులస్థులు డి.హీరేహాళ్, కళాలి కులస్థులు తాడిపత్రి మున్సిపాలిటీలోని దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(5 / 7)
అనంతపురం జిల్లాలోని 10 ఎక్సైజ్ పోలీసు స్టేషన్లల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అధికారులు స్పష్టం చేశారు. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(6 / 7)
దరఖాస్తుదారులు రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించినట్లు వివరించారు. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(7 / 7)
ఏపీ ప్రభుత్వం రెండేళ్ల కాలానికి మద్యం పాలసీ ప్రకటించింది. ఈ పాలసీలో భాగంగా గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. గీత కులాల సాధికారతను ప్రోత్సహించేందుకు ఈ షాపులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)ఇతర గ్యాలరీలు