'రైతు భరోసా స్కీమ్' అప్డేట్ - కొత్తగా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్…! ఈ పత్రాలుంటే చాలు-applications are being accepted from new farmers for the rythu bharosa scheme ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'రైతు భరోసా స్కీమ్' అప్డేట్ - కొత్తగా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్…! ఈ పత్రాలుంటే చాలు

'రైతు భరోసా స్కీమ్' అప్డేట్ - కొత్తగా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్…! ఈ పత్రాలుంటే చాలు

Published Jun 13, 2025 10:33 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 13, 2025 10:33 AM IST

వానాకాలం సీజన్ రావటంతో రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈసారి తొందరగానే విడుదల చేయాలని భావిస్తోంది. మరోవైపు రైతు భరోసా స్కీమ్ కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ స్కీమ్  రైతుబంధుగా ఉండేది. ప్రస్తుతం అర్హులైన అర్హులకు ఎకరానికి రూ. 6 వేలు అందజేయనున్నారు.

(1 / 8)

(image source unsplash)

వానాకాలం సీజన్ రావటంతో రైతన్నలు సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. సాగుబాటు చేస్తూ… విత్తనాలు నాటుతున్నారు. ఈ నేపథ్యంలో పంటపెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి ముందుగానే నిధులను జమ చేయాలని చూస్తోంది.

(2 / 8)

.ఈ స్కీమ్ కు సంబంధించి తెలంగాణ వ్యవసాయశాఖ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త దరఖాస్తులపై ప్రకటన చేసింది. 05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

(3 / 8)

(image source unsplash.com)

కొత్త దరఖాస్తుదారులు…. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది.

(4 / 8)

గతంలో రైతు భరోసా పొంది బ్యాంక్ ఖాతా మార్పిడి చేసుకోవాలనుకునే రైతులకు కూడా వ్యవసాయశాఖ మరో ఆప్షన్ ఇచ్చింది.  వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా మార్పిడికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పత్రాలను ఇస్తే సరిపోతుందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

(5 / 8)

రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది.

(6 / 8)

గతంలో రైతుబంధు వచ్చిన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.  వీలైనంత త్వరగా కొత్త రైతులు వారి వివరాలను అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుల విషయంపై రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలానికి చెందిన వ్యవసాయ అధికారులతో HT తెలుగు మాట్లాడింది. త్వరగా దరఖాస్తు చేసుకుంటే వివరాలు అప్డేట్ అవుతాయని, పెట్టుబడి సాయం అందే విషయంలో ఇబ్బందులు రావని వెల్లడించారు.

(7 / 8)

భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుంది. డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.ఎలాంటి మధ్యువర్తుల ప్రమేయం ఉండదు.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు