TG Ration Card Applications : ‘మీ-సేవలో రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ - మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే...!
- Telangana Ration Card Applications : మీసేవా కేంద్రాల నుంచి రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కొత్త దరఖాస్తుతో పాటు పాత కార్డుల్లో కూడా మార్పులు చేసుకోవచ్చు. అయితే ఇందుకు కావాల్సిన పత్రాలెంటో ఇక్కడ తెలుసుకోండి…..
- Telangana Ration Card Applications : మీసేవా కేంద్రాల నుంచి రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కొత్త దరఖాస్తుతో పాటు పాత కార్డుల్లో కూడా మార్పులు చేసుకోవచ్చు. అయితే ఇందుకు కావాల్సిన పత్రాలెంటో ఇక్కడ తెలుసుకోండి…..
(1 / 7)
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం చూస్తున్నవారికి ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. మొన్నటి వరకు ఆఫ్ లైన్ లోనే దరఖాస్తులు స్వీకరించగా… ఇకపై మీసేవా కేంద్రాల నుంచి కూడా అప్లికేషన్లను తీసుకోవాలని నిర్ణయించింది.
(2 / 7)
మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పాత కార్డుల్లో మార్పులుచేర్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. ఈ మేరకు మీ-సేవ డైరెక్టర్‌కు ఆ శాఖ శుక్రవారం లేఖ రాసింది.
(3 / 7)
తాజాగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు తమకు సమీపంలోని మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఇబ్బందులు లేకుండా ప్రాసెస్ చేసుకునే వీలు ఏర్పడనుంది.
(4 / 7)
కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లే వారు… అక్కడ అందుబాటులో ఉండే మీసేవా దరఖాస్తు ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. అంతేకాకుండా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డుతో పాటు నివాసపత్రాల(అడ్రస్ ఫ్రూప్ )ను సమర్పించాల్సి ఉంటుంది.
(5 / 7)
దరఖాస్తుదారుడి పత్రాలను పీడీఎఫ్ రూపంలో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలు లేకుండా కొత్త రేషన్ కార్డుతో పాటు పాత కార్డుల్లో మార్పులు చేసుకోవడానికి వీలు ఉండదు. సరైన పత్రాలు సమర్పించకుంటే… తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.
(6 / 7)
పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్చుకునేందుకు కూడా మీసేవా అప్లికేషన్ ఫామ్ నింపాలి. అంతేకాకుండా చేర్చాల్సిన వారి ఆధార్ కార్డులు, ఇంటి చిరునామా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
(7 / 7)
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించినట్లే అవుతుంది. స్థానికంగా ఉండే మీసేవా కేంద్రాలకు వెళ్లి సులభంగా దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. మీసేవా కేంద్రాల నుంచి దరఖాస్తుల తీసుకునే ఆప్షన్ అందుబాటులోకి రావటంతో కొత్త దరఖాస్తులు భారీగానే వచ్చే అవకాశం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు