Flemingo Festival 2025 : అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం, మూడ్రోజుల పాటు 5 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు-ap tourism department starts flamingo festival 2025 nelapattu pulicat lake bird watch events ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Flemingo Festival 2025 : అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం, మూడ్రోజుల పాటు 5 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

Flemingo Festival 2025 : అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం, మూడ్రోజుల పాటు 5 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

Jan 18, 2025, 06:05 PM IST Bandaru Satyaprasad
Jan 18, 2025, 06:05 PM , IST

Flemingo Festival 2025 : ఐదేళ్ల తర్వాత ఏపీలో మళ్లీ ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్-2025 ను పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని 5 ప్రాంతాలలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.

ఐదేళ్ల తర్వాత ఏపీలో మళ్లీ ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్-2025 ను పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ప్రకృతి, సంస్కృతి, జీవవైవిధ్యాల మహోత్సవంగా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని 5 ప్రాంతాలలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 

(1 / 6)

సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్- 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్,  జేసీ శుభం బన్సల్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ఫ్లెమింగో ఫెస్టివల్ ను శనివారం ప్రాంభించారు.  

(2 / 6)

ఫ్లెమింగో ఫెస్టివల్ ను జనవరి 18,19, 20 తేదీల్లో నేలపట్టు, అతికానితిప్ప, సూళ్లూరుపేట, బీవీ పాలెం, శ్రీసిటీలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తు్న్నారు. నిపుణులు నేలపట్టు, పులికాట్ సరస్సు ద్వారా టూరిస్టులు పక్షుల సహజ ఆవాసాలలో వలస పక్షులను చూసేందుకు తీసుకెళ్తారు. అలాగే ఈ ఈవెంట్లలో ఏపీ సంప్రదాయ కళారూపాలు, సంగీతం, నృత్యాలను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా ప్రత్యేక రుచులు, సంప్రదాయ వంటకాలను టూరిస్టులు ఆస్వాదించవచ్చు. 

(3 / 6)

ఫ్లెమింగో ఫెస్టివల్ ను జనవరి 18,19, 20 తేదీల్లో నేలపట్టు, అతికానితిప్ప, సూళ్లూరుపేట, బీవీ పాలెం, శ్రీసిటీలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తు్న్నారు. 
నిపుణులు నేలపట్టు, పులికాట్ సరస్సు ద్వారా టూరిస్టులు పక్షుల సహజ ఆవాసాలలో వలస పక్షులను చూసేందుకు తీసుకెళ్తారు. అలాగే ఈ ఈవెంట్లలో ఏపీ సంప్రదాయ కళారూపాలు, సంగీతం, నృత్యాలను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా ప్రత్యేక రుచులు, సంప్రదాయ వంటకాలను టూరిస్టులు ఆస్వాదించవచ్చు. 

వన్యప్రాణుల ఫోటోగ్రఫీ పోటీలు, పులికాట్ సరస్సులో బోటింగ్, జీవవైవిధ్యం పరిరక్షణపై ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, శ్రీ సిటీలో సీఎస్ఆర్,  టూరిజం కాన్ క్లేవ్ నిర్వహిస్తారు. చిత్తడి నేలలను సంరక్షించడానికి, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  వలస పక్షుల పరిరక్షణను ప్రపంచ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

(4 / 6)

ఈ ఫెస్టివల్ ద్వారా పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం, పర్యాటకులను ఆకర్షించడం, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడు రోజుల్లో సుమారు 6 నుంచి 7లక్షల మంది పర్యాటకులు ఈ ఫెస్టివల్ కు వస్తారని అంచనా వేస్తున్నారు.  

(5 / 6)

వలస పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఏపీలోని అభయారణ్యాలు ఏటా 75 జాతుల జల, భూసంబంధమైన పక్షులకు ఆతిథ్యం ఇస్తాయి, ఇవి సంతానోత్పత్తి, మేత స్థలాలను అందిస్తాయి. పులికాట్ సరస్సు ప్రతి సీజన్‌లో 20,000 గ్రేటర్ ఫ్లెమింగోలను ఆకర్షిస్తుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు