(1 / 5)
ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి ముహూర్తం ఖరారైంది. కొత్తగా మరో 93 వేల మంది వితంతువులకు పింఛన్లు జారీ చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద ఈ ఏడాది మే నెలలో కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
(2 / 5)
రాష్ట్రంలో కొత్తగా సుమారు 5 లక్షల మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించామని మంత్రి శ్రీనివాస్ అన్నారు. వారందరికీ త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు.
(3 / 5)
డ్వాక్రా సంఘాల బలోపేతాని మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి, దానిని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పేదరిక నిర్మూలనకు దాతల సాయం తీసుకుని, వారి ద్వారా పేదలకు మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు చేపడతామన్నారు.
(4 / 5)
ఇటీవల అసెంబ్లీలో పింఛన్ల వయస్సు తగ్గింపుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం చెబుతూ... 50 ఏళ్లు నిండినవారికి పింఛన్ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరిపామన్నారు.
ఇతర గ్యాలరీలు