'తల్లికి వందనం స్కీమ్' అప్డేట్స్ - ఈ 3 పనులను వెంటనే పూర్తి చేసుకోండి...!-ap thalliki vandanam scheme updates these three important things must be done ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'తల్లికి వందనం స్కీమ్' అప్డేట్స్ - ఈ 3 పనులను వెంటనే పూర్తి చేసుకోండి...!

'తల్లికి వందనం స్కీమ్' అప్డేట్స్ - ఈ 3 పనులను వెంటనే పూర్తి చేసుకోండి...!

Published Jun 09, 2025 03:30 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 09, 2025 03:30 PM IST

ఏపీ సర్కార్ 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… మూడు ముఖ్యమైన పనులను పూర్తి చేసుకొని ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకోండి..

ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తల్లికి వందనం స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 12 లేదా 14వ తేదీ నుంచి స్కీమ్ ను ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.

(1 / 7)

ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తల్లికి వందనం స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 12 లేదా 14వ తేదీ నుంచి స్కీమ్ ను ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.

ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.

(2 / 7)

ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.

అయితే తల్లికి వందనం స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లిదండ్రులు 3 పనులను తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వీటిపై తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు.

(3 / 7)

ఈ స్కీమ్ రావాలంటే తల్లులతో పాటు వారి పిల్లల వివరాలన్నీ కూడా హౌస్ డేటా బేస్ లో తప్పకుండూ నమోదు చేసుకుని ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసుకొని వాళ్లు స్థానిక అధికారులను సంప్రదించవచ్చని చెబుతున్నారు.

(4 / 7)

ఈకైవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుండా డబ్బుల చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు.  ఇక బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా NPCIతో లింక్ చేయబడి ఉండాలని చెబుతున్నారు. ఈ మూడు సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా డబ్బులు జమవుతాయని చెబుతున్నారు.

(5 / 7)

ఈకైవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుండా డబ్బుల చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. ఇక

బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా NPCIతో లింక్ చేయబడి ఉండాలని చెబుతున్నారు. ఈ మూడు సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా డబ్బులు జమవుతాయని చెబుతున్నారు.

లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.

(6 / 7)

లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.

ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది.  ఈ స్కీమ్ కు సంబంధించి ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

(7 / 7)

ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. ఈ స్కీమ్ కు సంబంధించి ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు