AP TET DSC 2024 Updates : ఏపీ టెట్ ఫలితాలు వాయిదా..! నవంబర్ 4న విడుదల, 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్-ap tet results will be released on 4th november latest updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tet Dsc 2024 Updates : ఏపీ టెట్ ఫలితాలు వాయిదా..! నవంబర్ 4న విడుదల, 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్

AP TET DSC 2024 Updates : ఏపీ టెట్ ఫలితాలు వాయిదా..! నవంబర్ 4న విడుదల, 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్

Nov 02, 2024, 07:14 AM IST Maheshwaram Mahendra Chary
Nov 02, 2024, 07:14 AM , IST

  • AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలను నవంబర్ 4వ తేదీన ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. మరోవైపు నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది. 

ఏపీ టెట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఫలితాల విడుదల వాయిదా పడింది. నవంబర్ 4వ తేదీన రిజల్ట్స్ వెల్లడించనున్నారు. 

(1 / 7)

ఏపీ టెట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఫలితాల విడుదల వాయిదా పడింది. నవంబర్ 4వ తేదీన రిజల్ట్స్ వెల్లడించనున్నారు. (image source unsplash.com)

విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం… ఇవాళే (నవంబర్ 2) ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఫైనల్ కీ విడుదలలో జాప్యం జరగటంతో రిజల్ట్స్ తేదీని మార్చినట్లు తెలిసింది. నవంబర్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. 

(2 / 7)

విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం… ఇవాళే (నవంబర్ 2) ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఫైనల్ కీ విడుదలలో జాప్యం జరగటంతో రిజల్ట్స్ తేదీని మార్చినట్లు తెలిసింది. నవంబర్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. (image source unsplash.com)

ఏపీ టెట్ పరీక్షలు 17 రోజల పాటు జరిగాయి. ప్రతి రోజు 2 విడతలుగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,68,661 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

(3 / 7)

ఏపీ టెట్ పరీక్షలు 17 రోజల పాటు జరిగాయి. ప్రతి రోజు 2 విడతలుగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,68,661 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.(image source unsplash.com)

ఏపీ టెట్ రాసిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

(4 / 7)

ఏపీ టెట్ రాసిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. (image source unsplash.com)

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ 6వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. 

(5 / 7)

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ 6వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. (image source unsplash.com)

నవంబర్ 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి… వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 

(6 / 7)

నవంబర్ 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి… వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. (image source unsplash.com)

తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి. అధికారికంగా విద్యాశాఖ విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఖాళీలపై మరింత స్పష్టత రానుంది.

(7 / 7)

తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి. అధికారికంగా విద్యాశాఖ విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఖాళీలపై మరింత స్పష్టత రానుంది.(image source unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు