(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగలాడుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు(ఏప్రిల్ 14న) ఏపీలోని 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 98 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(image source unsplash.com)(2 / 6)
ఏపీలోని కాకినాడ జిల్లాలోని 3 మండలాలు, కోనసీమలోని 7 మండలాలు, తూర్పు గోదావరి గోకవరంతో కలిపి మొత్తం 11 మండలాల్లో తీవ్రవడగాలులు, మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
(3 / 6)
రేపు(ఏప్రిల్ 14న) శ్రీకాకుళం,విజయనగరం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి,కాకినాడ,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
(PTI)(4 / 6)
ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.8°C, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట, పల్నాడు జిల్లా రావిపాడులో 41.4°C, 54 మండలాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7 మిమీ, ప్రకాశం కనిగిరిలో 43 మిమీ,అల్లూరి జిల్లా బుట్టాయిగూడెంలో 39.5 మిమీ వర్షపాతం నమోదైందన్నారు.
(Image Source Pixabay )(5 / 6)
తెలంగాణలో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 - 3 °C పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
(pixabay)ఇతర గ్యాలరీలు