AP TG Sankranti Holidays 2025 : ఏపీ, తెలంగాణ సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే-ఎన్ని రోజులంటే?
AP TG Sankranti Holidays 2025 : ఏపీ, తెలంగాణ సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది. ఇరు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. ఏపీలో 10 రోజులు, తెలంగాణలో 7 రోజులు సెలవులు ప్రకటించారు.
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులు పాటు ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు. విద్య, ఉపాధి సొంతూళ్లకు దూరంగా ఉన్న వారంతా సంక్రాంతికి స్వగ్రామాలు తిరిగి వస్తాయి. పండుగ మూడు రోజులు ఎంతో సంతోషంగా గడుపుతారు. సంక్రాంతికి స్కూళ్లు, కాలేజీలకు భారీగానే సెలవులు ఇస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే సంక్రాంతి సెలవులపై క్లారిటీ ఇచ్చాయి.
(2 / 6)
ఏపీలో సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఇచ్చారు. ఇటీవలి వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. దీంతో సంక్రాంతి సెలవులు తగ్గిస్తారని ప్రచారం జరిగినా... అందులో నిజం లేదని ప్రభుత్వం తెలిపింది.
(3 / 6)
జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఇటీవల తెలిపారు. అంటే 10 రోజులు పాటు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు. జనవరి 13న భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమ పండుగలు జరుపుకోనున్నారు.
(4 / 6)
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై క్లారిటీ ఇచ్చింది. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ లో జనవరి 13న భోగి, 14న సంక్రాంతికి పబ్లిక్ హాలిడేస్ ఇచ్చింది. జనవరి 15 కనుమ రోజును ఆప్షన్ హాలి డేగా పేర్కొంది. తాజాగా విద్యాశాఖ సెలవులపై స్పష్టత ఇచ్చింది.
(5 / 6)
భోగికి ముందు రోజు అంటే జనవరి 11న రెండో శనివారం ఉంది. ఆ తర్వాత ఆదివారం... అంటే జనవరి 11 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతాయి. జనవరి 17 శుక్రవారంతో సెలవులు ముగుస్తాయి.
ఇతర గ్యాలరీలు