తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : బలహీనపడిన అల్పపీడనం - ఏపీలో వర్షాలు, ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే ఛాన్స్..!
- AP Telangana Weather Updates :నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈ మేరకు ఐఎండీ తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ బలహీనపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. అయితే దీనికి అనుబంధంగా ఉపరిత ఆవర్తనం అదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 1. 5 కి.మీ వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది.
(2 / 7)
అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
(3 / 7)
ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలోని పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈదురుగాలులు గంటలకు 30-40 కిమీ వేగంతో వీస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది.
(4 / 7)
రాయలసీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(5 / 7)
ఇక తెలంగాణకు కూడా ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హెచ్చరికలు లేవని పేర్కొంది.
(6 / 7)
ఇక రేపు కూడా తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
ఇతర గ్యాలరీలు