(1 / 6)
ఏపీ తెలంగాణలో మరికొన్నిరోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
(photo source @APSDMA twitter)(2 / 6)
తెలంగాణ నుంచి బంగాళఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి... రాయలసీమ నుంచి పశ్చిమ బంగాళాఖాతం మీదుగా కొనగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. రుతుపవనాలు కూడా మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది.
(3 / 6)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం….
(4 / 6)
ఇవాళ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)
జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. జూన్ 21వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(6 / 6)
నైరుతిరుతుపవనాలు ఒడిశా,కోస్తాంధ్ర & వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు వెళ్లేందుకు రానున్న3-4రోజులు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ తెలిపింది. ఇవాళ(జూన్ 14శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(photo source @APSDMA twitter)ఇతర గ్యాలరీలు