(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది.
(2 / 6)
ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.
(3 / 6)
ఏపీలో రానున్న మూడు రోజులు వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ శాఖ ఆదివారం కీలక ప్రకటన విడుదల చేసింది. దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో దక్షిణ ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఈ గాలుల ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
(4 / 6)
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నేడు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
(PTI)(5 / 6)
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఆది, సోమ, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
(ANI)ఇతర గ్యాలరీలు