AP Sankranti Holidays : ఏపీ విద్యార్థులకు అలర్ట్, సంక్రాంతి సెలవులు తగ్గించే యోచనలో విద్యాశాఖ!
AP Sankranti Holidays : ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు జరగనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం సంక్రాంతికి జనవరి 10 నుంచి 19 వరకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే జనవరి 11-15 వరకు లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉండొచ్చని సమాచారం.
(1 / 6)
ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు జరగనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం సంక్రాంతికి జనవరి 10 నుంచి 19 వరకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది.
(2 / 6)
ఏపీలో ఇటీవల భారీ వర్షాలతో పలు జిల్లాల్లో స్కూళ్లు,కాలేజీలకు కలెక్టర్లు వరుసగా సెలవులు ఇచ్చారు. దీంతో విద్యాసంవత్సం పనిదినాలు తగ్గుతున్నాయి. దీంతో పనిదినాలు తగ్గకుండా ఉండేందుకు సంక్రాంతి సెలవులు కుదించనున్నట్లు తెలుస్తుంది.
(3 / 6)
జనవరి 11వ తేదీ నుంచి 15 వరకు లేదా 12వ తేదీ నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండొచ్చని సమాచారం. త్వరలో పొంగల్ హాలీడేస్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది.
(4 / 6)
ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ. ఊర్ల నుంచి వచ్చే బంధువులతో ప్రతి ఇల్లు సందడిగా ఉంటుంది. ఏటా సంక్రాంతి పది రోజుల వరకు సెలవులు వచ్చేవి. కానీ ఈసారి సంక్రాంతి సెలవులు కుదిస్తున్నారని తెలిసి విద్యార్థులు నిరాశ చెందుతున్నారు.
(Twitter)(5 / 6)
ఏపీలో ఇప్పటికే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు.
(istockphoto)ఇతర గ్యాలరీలు