(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో రాయలసీమ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(2 / 6)
ఇవాళ, రేపు, ఎల్లుండి సీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తాజా బులెటిన్(ఆగస్టు 15 లో హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది.
(3 / 6)
ఆగస్టు 15వ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు ఈ వర్షాలు ఉంటాయని ఐఎండీ వివరించింది. మిగతా ప్రాంతాలతో పోల్చితే… రాయలసీమ, యానాం ప్రాంతంలో వానలు ఎక్కువగా పడే అకాశం ఉందని పేర్కొంది.
(4 / 6)
తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 8. 30 గంటల వరకు చూస్తే.... ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
(5 / 6)
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట,స మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 6)
ఇవాళ్టి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇతర గ్యాలరీలు